War 2 OTT: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan), టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కాంబినేషన్‌లో వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘వార్ 2’ (War 2 Movie). ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త వచ్చేసింది. కొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీ విడుదలపై వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ‘వార్ 2’ డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేందుకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ విడుదల చేసింది. ఇంకొన్ని గంటల్లోనే ఈ సినిమా ఓటీటీలో ప్రత్యక్షం కాబోతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ‘వార్ 2’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 9 నుంచి హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. (War 2 OTT Release Date)
Also Read- Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కారుకు యాక్సిడెంట్.. అసలేం జరిగిందంటే?
ప్రధాన ఆకర్షణ ఇదే..
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్.. 14 ఆగస్ట్, 2025న థియేటర్లలో విడుదలైంది. హృతిక్ రోషన్ మేజర్ కబీర్ ధాలివాల్ పాత్రను తిరిగి పోషించగా, జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ యూనిట్స్ ఆఫీసర్ విక్రమ్ పాత్రలో పవర్‌ఫుల్ బాలీవుడ్ అరంగేట్రం చేశారు. వీరితో పాటు కియారా అద్వానీ, అనిల్ కపూర్, అశుతోష్ రాణా కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా ఇద్దరు అగ్రశ్రేణి ఏజెంట్ల మధ్య జరిగే హోరాహోరీ పోరాటంగా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కాకపోతే, థియేటర్లలో ఈ సినిమా మిశ్రమ స్పందననే రాబట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 350 కోట్లుకు పైగా వసూలు చేసిన ఈ సినిమా.. ఫ్లాప్ సినిమాగానే మిగిలిపోయింది. ఇక బిగ్ స్క్రీన్‌పై మిస్ అయిన వారు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ ఎంట్రీని చూడాలనుకునే అభిమానులు ఓటీటీ విడుదల కోసం వేచి చూస్తున్నారు. ఈ వారం డిజిటల్ రిలీజ్‌లలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.
Also Read- Varun Sandesh: మళ్ళీ ఆ రోజులు రిపీట్ అవుతాయి.. ‘కానిస్టేబుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వరుణ్ సందేశ్..
ఈ సినిమా కథ ఏంటంటే..
ఈ కథ రా మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్) దేశానికి ద్రోహం చేశాడనే ఆరోపణలతో మొదలవుతుంది. కబీర్‌ను పట్టుకునే బాధ్యతను రా ఏజెంట్ విక్రమ్ (జూనియర్ ఎన్టీఆర్)కు అప్పగిస్తారు. దీంతో ఇద్దరు అగ్రశ్రేణి ఏజెంట్ల మధ్య జరిగే హోరాహోరీ పోరాటంగా ఈ చిత్రం సాగుతుంది. అసలు కబీర్ చేసిన దేశ ద్రోహం ఏమిటి? రా విభాగానికి చీఫ్ కల్నల్ సునీల్ లూథ్రా (అశుతోష్ రాణా)ని కబీర్ ఎందుకు చంపాడు? సునీల్ లూథ్రా కుమార్తె వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అడ్వాణీ)కు, కబీర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? కబీర్‌ను విక్రమ్ అండ్ టీమ్ పట్టుకుందా? విక్రమ్ గురించి తెలిశాక కబీర్ ఏం చేశాడు? అనేది తెలియాలంటే.. అక్టోబర్ 9న నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న ఈ సినిమాను చూడాల్సిందే.
Double the rage. Double the rampage. Ready for the War? 🔥#War2OnNetflix pic.twitter.com/ABUr3PMuiw
— Netflix India (@NetflixIndia) October 8, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
