SSC CPO Recruitment: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2025లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) ఢిల్లీ పోలీస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల కోసం 2861 ఖాళీలను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే గ్రాడ్యుయేట్లకు అద్భుతమైన అవకాశం. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా 26 సెప్టెంబర్ 2025 నుంచి 16 అక్టోబర్ 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. SSC CPO SI రిక్రూట్‌మెంట్ 2025కి సంబంధించిన అర్హత, వయోపరిమితి, జీతం, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు రుసుము, ముఖ్య తేదీల వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
ఖాళీల వివరాలుపోస్టు: సబ్-ఇన్‌స్పెక్టర్ (GD) in CAPF, సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) in ఢిల్లీ పోలీస్.
మొత్తం ఖాళీలు: 2861 (కేటగిరీ-వైజ్, రీజియన్-వైజ్ వివరాలు డీటెయిల్డ్ నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంటాయి).
పోస్టు రకం: గ్రూప్ ‘B’ (నాన్-గెజిటెడ్), నాన్-మినిస్టీరియల్.
వయోపరిమితి
కనీస వయసు: 20 సంవత్సరాలు.
గరిష్ట వయసు: 25 సంవత్సరాలు (అభ్యర్థి 02-08-2000 మరియు 01-08-2005 మధ్య జన్మించి ఉండాలి).
SC/STకు 5 సంవత్సరాలు, OBCకు 3 సంవత్సరాలు, మాజీ సైనికులకు నిబంధనల ప్రకారం (వివరాలు నోటిఫికేషన్‌లో చూడండి)
అర్హత
విద్యా అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానం.
డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ 16-10-2025 నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు రుసుము
జనరల్/OBC/ఇతరులు: రూ. 100.
SC/ST/మహిళలు/మాజీ సైనికులు: రూ. 0 (మినహాయింపు).
పేమెంట్ మోడ్: ఆన్‌లైన్ (నెట్ బ్యాంకింగ్, కార్డ్, UPI) లేదా ఆఫ్‌లైన్ (SBI చలాన్).
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 26-09-2025.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 16-10-2025.
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 17-10-2025.
స్కీమ్ ఆఫ్ ఎక్సామ్
శారీరక ప్రమాణాల పరీక్ష (PST)
శారీరక దారుఢ్య పరీక్ష (PET)
వివరణాత్మక వైద్య పరీక్ష (DME)
డాక్యుమెంట్ వెరిఫికేషన్
