Massive Explosion: ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా రాయవరంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. కొమరిపాలెంలోని లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ (బాణసంచా తయారీ పరిశ్రమ)లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు.
Also Read: Adluri Laxman vs Ponnam: మంత్రుల మధ్య సయోధ్య.. విభేదాలను చక్కదిద్దిన టీపీసీసీ.. వివాదం ముగిసినట్లే!
పేలుడు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటీనా ఘటన స్థలికి చేరుకుంది. బాణాసంచా పరిశ్రమలో ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 40 మంది పనిచేస్తున్నట్లు సమాచారం.
బాణాసంచా పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితుల చికిత్స విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాద ఘటన కలిచివేసింది. ఈ ఘోర ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించింది. ప్రమాద కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలు, వైద్య సాయంపై అధికారులతో మాట్లాడాను. స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక…
— N Chandrababu Naidu (@ncbn) October 8, 2025
