Sreeleela: 'మాస్ జాతర'లో తన రోల్ ఏంటో చెప్పిన శ్రీలీల..
sree-leela( image :X)
ఎంటర్‌టైన్‌మెంట్

Sreeleela: ‘మాస్ జాతర’లో తన రోల్ ఏంటో చెప్పిన శ్రీలీల.. అందుకే మాస్ మహారాజ్..

Sreeleela: తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మాస్ జతర’. రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాస్యం, భావోద్వేగాలు మరియు మాస్ అంశాలతో నిండిన వినోదభరితమైన కుటుంబ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ‘మాస్ జతర’ సినిమా, భారీ అంచనాల నడుమ అక్టోబర్ 31న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలకు విశేష స్పందన లభించింది. విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది.

Read also-Travel Date Change: రైల్వేస్ నుంచి ఊహించని గుడ్‌న్యూస్.. ఇకపై టికెట్ కన్మార్ఫ్ అయ్యాక కూడా..

రవితేజ తో కలిసి నటించడంపై శ్రీ లీల ఇలా చెప్పుకొచ్చారు.. రవితేజ తో కలిసి పనిచేయడం చాలా సులభంగా ఉంటుందని, అత్యంత ఆహ్లాదకరమైన సహనటులలో ఆయన ఒకరని శ్రీలీల తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మాస్ జాతరలో తాను సైన్స్ టీచర్‌గా, శ్రీకాకుళం యాసలో మాట్లాడే ఉల్లాసభరితమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తానని అన్నారు. తన మునుపటి పాత్రలకు పూర్తి భిన్నంగా ఇది ఉంటుంది. స్క్రిప్ట్ చదివినప్పుడే తాను నవ్వుకున్నానని, ఇక సెట్ లో దానిని ప్రదర్శించే సమయంలో ఆ నవ్వులు రెట్టింపు అయ్యాయని శ్రీలీల పేర్కొన్నారు. రవితేజ అంకితభావం గురించి మాట్లాడుతూ.. గాయంతో బాధపడుతున్నప్పటికీ, ఆయన ఆసుపత్రికి వెళ్లే ముందు ‘తూ మేరా లవర్’ పాటను పూర్తి చేసి, సినిమాపై తన నిబద్ధతను చాటుకున్నారని శ్రీలీల కొనియాడారు.

Read also-Indian Techie: భారతీయ టెకీని ఉద్యోగంలోంచి తీసేసి.. మళ్లీ రమ్మని బతిమాలుతున్న కంపెనీ

రవితేజ ఈ సినిమాలో తాను పోషించిన ఆర్‌పిఎఫ్(రైల్వే పోలీస్ ఫోర్స్) పాత్ర గురించి మాట్లాడుతూ, ఇది తన సినీ ప్రయాణంలో సరికొత్త ప్రత్యేకమైన పాత్ర అని అభివర్ణించారు. అలాగే చిత్ర దర్శకుడు భాను భోగవరపు, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోపై ప్రశంసలు కురిపించారు. భాను ప్రతిభావంతుడని, చిత్రీకరణ సమయంలో కూడా సన్నివేశాన్ని ఇంకా మెరుగ్గా మలచడానికి ప్రయత్నిస్తుంటాడని, చాలా వేగంగా మార్పులు చేయగలడని కొనియాడారు. భీమ్స్ ఎంతో కృషి చేసి, ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాడని అన్నారు. ఈ సినిమా దర్శకుడు గతంలో సామజవరగమన, వాల్తేరు వీరయ్య చిత్రాలకు రచయితగా పనిచేసిన దర్శకుడు భాను, హాస్యాన్ని రాయడం దానిని సహజంగా కథలో మిళితం చేయడంలో తన బలం ఉందని తెలిపారు. మొదటి రోజు షూటింగ్‌ను సులభంగా పూర్తి చేసి, ప్రారంభం నుండే తనలో ఆత్మవిశ్వాసం పెరిగేలా సహాయపడినందుకు రవితేజకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ వినోదభరితమైన పాత్రలో కనిపిస్తారని కూడా ఆయన పేర్కొన్నారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..