varun-sandesh(image :X)
ఎంటర్‌టైన్మెంట్

Varun Sandesh: మళ్ళీ ఆ రోజులు రిపీట్ అవుతాయి.. ‘కానిస్టేబుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వరుణ్ సందేశ్..

Varun Sandesh:  ‘కొత్త బంగారు లోకం’, ‘హ్యాపీ డేస్’ సినిమాలతో యువతకు దగ్గరైన వరుణ్ సందేశ్ మరో కొత్త మూవీ కథాంశంతో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నారు. వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో బలగం జగదీశ్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. సమాజంలో జరుగుతున్న అంశాల ప్రేరణతో ఈ చిత్రాన్ని రూపొందించామాని. కమర్షియల్, ఎంటర్టైన్మెంట్, సందేశం వంటి అంశాలను మిళితమై ఈ సినిమా ఉంటుందని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చారు.

Read also-Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కొత్త రూల్స్.. రాజకీయ పార్టీలకు ఈసీ కీలక సూచనలు

ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. “నా కెరీర్ లో అక్టోబర్ నెలను మరచిపోలేను. ఎందుకంటే దాదాపు పద్దెనిమిది ఏళ్ల క్రితం నేను నటించిన తొలి చిత్రం “హ్యాపీడేస్” 2007లో ఇదే నెలలో విడుదలై, ఘన విజయం సాధించి, నా కెరీర్ నే మలుపు తిప్పింది. అందుకే నా జీవితంలో అక్టోబర్ మాసం గుర్తుండి పోయింది. ఇప్పుడు ఈ చిత్రం కూడా ఇదే నెలలో విడుదలవుతుండటంతో ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి” అని హీరో వరుణ్ సందేశ్ అన్నారు. నిర్మాత బలగం జగదీశ్.. “ఈ చిత్రానికి సెన్సార్ యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 10న చిత్రాన్ని భారీగా విడుదల చేయబోతున్నాం. ఒక అమ్మాయికి అవమానం జరిగితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అన్న అంశాన్ని చూపించాం. అమ్మాయిలతో పాటు తల్లి తండ్రులు కూడా ఈ సినిమాను చూడాలి” అని అన్నారు.

దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ, ట్రైలర్, పాటలకు వచ్చిన స్పందన సినిమా పట్ల మా నమ్మకాన్ని పెంచింది. నిర్మాత కథను నమ్మి స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే ఈ సినిమా తెరపైకి వచ్చింది” అని అన్నారు. ఈ వేడుకలో యువ హీరోలు అర్జున్, కార్తీక్ రాజు, విశ్వ కార్తికేయ, ఇంకా సునామీ సుధాకర్, దువ్వాసి మోహన్, కెమెరామెన్ హజరత్, సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్, సహ నిర్మాతలు నికిత జగదీష్, కుపేంద్ర పవర్, ఇతర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు నటించారు.

Read also-Watch Video: నదిలో స్నానం చేస్తుండగా.. మహిళను ఎత్తుకెళ్లిన మెుసలి.. వీడియో వైరల్

ఈ చిత్రానికి కెమెరా మెన్ గా హజరత్ షేక్ (వలి) ఉన్నారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందించారు.వర ప్రసాద్, బి.జి.ఎం.:గ్యాని ఎడిటింగ్ చూసుకున్నారు. వి. నాని ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. మాటలు పండు రాస్తే, పాటలు శ్రీనివాస్ తేజ, రామారావు, శ్రీనివాస్ తేజ రాశారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా మిట్టపల్లి జగ్గయ్య, సహనిర్మాతగా బి నికిత జగదీష్, కుపేంద్ర పవర్, నిర్మాతగా బలగం జగదీష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఆర్యన్ సుభాన్ లు తమ బాధ్యతలు నిర్వహించారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!