Telangana Govt: బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రతిష్టాత్మకం
Telangana Govt ( image cxredit; twitter)
Telangana News

Telangana Govt: బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ సర్కార్

Telangana Govt: బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీసీలకు రిజర్వేషన్ (BC reservations) కల్పించే అంశంపై అడుగడుగునా జాగ్రత్తలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు, హైకోర్టులోను కేసు గెలిచేందుకు తన సర్వశక్తులు ఒద్దు తోంది. సోమవారం సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ల బృందం ముందు రోజే ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులు, ఉన్నతాధికారులతో చర్చించింది.

Also Read: Crime News: వివాహేతర సంబంధం అనుమానంతో.. భార్యను అతి దారుణంగా హత్య చేసిన భర్త.. ఎక్కడంటే?

 హైకోర్టులోహాజరై వాదనలు వినిపించాలి 

బీసీ రిజర్వేషన్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయ కోవిదుడు అభిషేక్ సింగ్వి, సిద్ధార్థ దవే లు హాజరు కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తోపాటు మంత్రుల బృందం స్వయంగా సుప్రీంకోర్టుకు వెళ్లి వాదనలు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. బీసీ రిజర్వేషన్ల కేసు ఈనెల 8న (బుధవారం) విచారణ నేపథ్యంలో స్వయంగా హాజరు కావలసిందిగా న్యాయ కోవిదుడు అభిషేక్ సింగ్వి ని ఫోన్లో సీఎం రేవంత్ రెడ్డి  కోరారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు  హైకోర్టులో కేసు విచారణ నేపథ్యంలో స్వయంగా హాజరై వాదనలు వినిపించాలని  ఢిల్లీలో సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగ్వి ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రుల బృందం ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారు.

హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు విచారణ

బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం గంట గంటకు పరిస్థితిని అంచనా వేస్తూ ముందుకు వెళుతుంది. ఈ క్రమంలో నే నేడు హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు విచారణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన చర్యలు తదితర అనుబంధ అంశాలను చర్చించేందుకు ఏకైక ఎజెండాపై సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Coldrif Warning: చిన్నపిల్లల దగ్గుమందుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..