Khammam district: ఖమ్మం జిల్లా (Khammam district) కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన యువ శాస్త్రవేత్త అశ్విని, తన తండ్రి మోతిలాల్ కు సోదరుడు అశోక్ గుడి కట్టించి విగ్రహాలు ప్రతిష్టించాడు. గత సంవత్సరం తమ స్వగ్రామం నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బయలుదేరిన అశ్విని, తండ్రి మోతిలాల్ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయ గూడెం బ్రిడ్జి పైనుంచి వెళ్తున్న కారు ఆకేరు వాగు వరదలో కొట్టుకుపోయింది. ఈ ఘటన గత ఏడాది సెప్టెంబర్ లో సంచలనంగా మారింది.
Also Read: TSLPRB Recruitment 2025: TSRTC రిక్రూట్‌మెంట్ 2025.. డ్రైవర్, శ్రామిక్ పోస్టుల కోసం దరఖాస్తులు
జ్ఞాపకాలు శాశ్వతంగా తమ తోటి ఉండాలి
కారుతో సహా తండ్రి మోతిలాల్, అగ్రికల్చర్ యువ శాస్త్రవేత్త అశ్విని ఇద్దరు కొట్టుకుపోయి మరణించారు. వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తమ తోటి ఉండాలని ఆకాంక్షతో విగ్రహాలు ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నట్లు అశ్విని సోదరుడు అశోక్ తెలిపాడు. అంతేకాకుండా తెలంగాణ అగ్రికల్చర్ ఆధ్వర్యంలో ఓ విత్తనానికి అశ్విని పేరు పెట్టడం గమనార్హం. అశ్విని చివరి రోజు తండాలో యువత అందరిని ఒకచోటకు చేర్చి చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని వివరించింది.
అకాల వర్షానికి నీళ్ల సుడిగుండంలో పడి మృత్యువాత
చదువుతోపాటు తల్లిదండ్రులను మర్చిపోకుండా చూస్తే మానవ జన్మకు అది గొప్ప వరం అవుతుందని పేర్కొన్నారు. నిత్యజీవితంలో తల్లిదండ్రులు పడే కష్టానికి చదువుకున్న పిల్లలు ఎదిగితే వారి సంతోషానికి అవధులు లేవని సూచనను యువతకు వివరించింది. భవిష్యత్తులో చదువుకున్న పిల్లలందరూ ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రుల లక్ష్యాన్ని నెరవేర్చాలని సూచించారు. అనుకోని అకాల వర్షానికి నీళ్ల సుడిగుండంలో పడి మృత్యువాత పడిన తండ్రి మోతిలాల్, చెల్లెలు అశ్వినీలకు గుర్తుగా గుడి కట్టించి అందులో వారి విగ్రహాలను ప్రతిష్టించడం గంగారం గ్రామంలోని ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచింది.
మృత్యువాత చెందిన యువ శాస్త్రవేత్త అశ్విని, తన తండ్రి విగ్రహాలు
బ్రతికున్న తల్లి దండ్రులు, అక్కచెల్లెలు, అన్న తమ్ముళ్లను పట్టించుకోని ఈ రోజుల్లో గత ఏడాది ఆఖరి వరద బీభత్సానికి కారుతో సహా కొట్టుకుపోయి మృత్యువాత చెందిన యువ శాస్త్రవేత్త అశ్విని, తన తండ్రి విగ్రహాలను ప్రతిష్టించి వారికి నిత్యం పూజలు చేయడం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని గంగారం తండావాసులు వ్యక్తం చేస్తున్నారు. బతికున్నంత కాలం సంతోషంగా ఉన్న అన్న చెల్లెలు, కుమారుడు తండ్రి మృతి చెందాక కూడా అదే విధంగా అంతే సంతోషంతో ఉండాలని లక్ష్యంతో గుడి కట్టించి అందులో వారి విగ్రహాలను ప్రతిష్టించి నిత్
అంతులేని విషాదం…
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే సమయంలో వరంగల్ నుండి డోర్నకల్ మధ్యలో తాళ్లపూస పెళ్లి వద్ద రైల్వే ట్రాక్ మీదకెళ్ళి వరద ప్రవాహం ఉదృతంగా ప్రవహిస్తుండడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో డోర్నకల్ నుండి పురుషోత్తమయ గూడెం మీదుగా మర్పెడ చేరుకొని అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు అశ్విని ఆమె తండ్రి మోతిలాల్ కారులో వెళ్లాల్సి ఉంది. అయితే ఊహించని నీటి ప్రవాహం పురుషోత్తమాయగూడెం వద్ద ఆశల పల్లకీని మింగేసింది. వరదల్లో కొట్టుకుపోయిన యువ శాస్త్రవేత్త డాక్టర్ నువ్వునావత్ అశ్విని అనంత లోకాలకు వెళ్ళిపోయింది.
తెలంగాణ రాష్ట్రమంతా కలకలం
ఈ ఘటన అప్పట్లో తెలంగాణ రాష్ట్రమంతా కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రాజధాని రాయపూర్ లోని ఐ సి ఏ ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ మేనేజ్మెంట్ (ఎం ఐ బి ఎం) లో జరగనున్న సదస్సు లో పాల్గొనేందుకు ఆమెకు ఆహ్వానం అందింది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాయపూర్ వెళ్లాలని ఆమె ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇంతలోనే వరద ఉధృతికి కారుతో సహా తండ్రి మోతిలాల్, యువ శాస్త్రవేత్త నునావత్ అశ్విని మృత్యు కోరల్లో చిక్కుకున్నారు.
Also Read: Dhruva Sarja: ‘సీతా పయనం’.. ధ్రువ సర్జా పవర్ ఫుల్ ఫస్ట్ లుక్.. గెస్ట్ రోలే కానీ!
