IT-Lay-Offs
Viral, లేటెస్ట్ న్యూస్

IT layoffs: ఏకంగా 11 వేల మంది తొలగించిన టాప్ ఐటీ కంపెనీ

IT LayOffs: ఐటీ కంపెనీల్లో కొత్త ఒరవడి కనిపిస్తోంది. వ్యయాల తగ్గింపు ప్రణాళికలను అమలు చేసేందుకు పెట్టుబడులు, నియామకాలు, లేదా మౌలిక వసతుల నిర్మాణాలకు సంబంధించిన ఖర్చులను నియంత్రించుకోవడానికి బదులు, ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడంపై (IT LayOffs) దృష్టిసారిస్తున్నాయి. టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటైన యాక్సెంచర్ (Accenture) అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. గత మూడేళ్లలో ‘బిజినెస్ ఆప్టిమైజేషన్’ పేరిట ఏకంగా 2 బిలియన్ డాలర్లకుపైగా ఖర్చు చేసిన ఈ కంపెనీ, ఇందులో గణనీయ మొత్తం ఉద్యోగుల తొలగింపు (severance) వ్యయాలకు కేటాయించింది. ఏ స్థాయిలో అంటే, గత మూడు నెలల్లో ఏకంగా 11,000 మందికిపైగా ఉద్యోగులపై యాక్సెంచర్ వేటు వేసింది.

యాక్సెంచర్ కంపెనీ తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 7,79,000కి తగ్గిపోయింది. మూడు నెలల క్రితం 7,91,000గా ఉండేదని తెలిపింది. గత త్రైమాసికంలో ఉద్యోగ విరమణ, తొలగింపుల కోసం కంపెనీ ఏకంగా 615 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసింది. ప్రస్తుత త్రైమాసికంలో అదనంగా 250 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేసే అవకాశం కనిపిస్తోంది. కంపెనీ పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా కొనసాగుతున్న ఈ తొలగింపుల కార్యక్రమం ద్వారా కంపెనీకి మొత్తంగా 1 బిలియన్ డాలర్లకు పైగా ఆదా అవుతుందని కంపెనీ అంచనాగా ఉంది.

Read Also- Crows: కాకులు ఇంటి చుట్టూ తిరుగుతున్నాయా.. అది చెడు శకునమా? జ్యోతిష్యలు ఏం చెబుతున్నారంటే?

ఆర్థిక సంవత్సరం-2025 నాలుగో త్రైమాసికంలో ఎంప్లాయీస్ ఆప్టిమైజేషన్ ప్రోగ్ మొదలైంది. ఉద్యోగ విరమణలు, ఉద్యోగుల సంఖ్య తగ్గింపుతో పాటు కంపెనీ వ్యూహాత్మక ప్రణాళికకు అనువుగా లేని అనుబంధ వ్యాపారాలను విక్రయించడం ఈ కంపెనీ ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ త్రైమాసికంలో కంపెనీ 11,419 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియకు సీఈవో జూలీ స్వీట్ నేతృత్వం వహిస్తున్నారు. ‘‘ వేగంగా మారుతున్న టెక్నాలజీ పరిస్థితులకు అనుగుణంగా మేము పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది’’ అని ఇన్వెస్టర్లతో జరిగిన ఓ సమావేశంలో ఆమె అన్నారు. ఉద్యోగులకు నైపుణ్యాలు నేర్పడం సాధ్యపడని పరిస్థితుల్లో వారిని వదులుకోకతప్పదని, ఈ విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని జూలీ స్వీట్ వివరణ ఇచ్చారు. కంపెనీ వ్యూహంలో భాగంగా రీస్కిల్లింగ్‌కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, ప్రతి ఉద్యోగిని అవసరమైన కొత్త పాత్రలకి మార్చడం సాధ్యం కాదని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

Read Also- Rangareddy District: పొలిటికల్ హీట్.. ఆ స్థానంలో గెలిస్తే జెడ్పీ ఛైర్పర్సన్ ఖాయం..!

అంతా ఏఐ ప్రభావం!

ఏఐ ప్రభావంతో అన్ని ఐటీ కంపెనీల్లో మాదిరిగానే యాక్సెంచర్ కంపెనీలోనూ పని విధానాలు, ఉద్యోగాలపై ప్రభావం పడుతోంది. ఈ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య తగ్గించాలనే నిర్ణయానికి అనేక కారణాలు ఉండవచ్చు, కానీ, ఏఐ ముఖ్యమైన కారణమని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ కంపెనీలో పనిచేస్తున్న ఒక బిజినెస్ అనలిస్ట్ మాట్లాడుతూ, చాలా ప్రాజెక్టులు పూర్తిగా ఆగిపోయాయని, యాక్సెంచర్‌లోని ఉద్యోగులే కొత్త ప్రాజెక్టుల కోసం అన్వేషిస్తున్నారని వివరించారు. ఈ మధ్యకాలంలో ప్రాజెక్టులు లేని ఉద్యోగుల సంఖ్య పెరిగిందని, అలాంటివారు ఏదైనా ప్రాజెక్ట్ ఉందా అని ఆఫీసులోని ఇతరుల్ని అడుగుతూ కనిపిస్తున్నారని చెప్పారు. అనేక మంది ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తోందని, ఉద్యోగాలు కోల్పోతుండడానికి బహుశా ఇదే కారణం కావచ్చని సదరు బిజినెస్ అనలిస్ట్ వ్యాఖ్యానించారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!