mitra-mandali( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Mitra Mandali trailer: ‘మిత్ర మండలి’ ట్రైలర్ వచ్చేసింది.. కామెడీ అదిరిపోయింది గురూ..

Mitra Mandali trailer: తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు నవ్వులు పూయించడానికి రాబోతుంది ‘మిత్ర మండలి’ సినిమా. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను విడుదల చేశారు నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టింది. యువతరాన్ని ఆకట్టుకునే ఫ్రెండ్‌షిప్–కామెడీగా రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఆయనతో పాటు నిహారిక ఎన్‌ఎమ్, బ్రహ్మానందం, విష్ణు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కామెడీ జానర్ లోరాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీపావళి కానుకగా విడుదలవుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కామెడీ డ్రామాగా రాబోతున్న “మిత్ర మండలి” అక్టోబర్ 16, 2025న థియేటర్లలో విడుదల కానుంది.

Read also-World Skills Competition 2026: వరల్డ్ స్కిల్ కాంపిటీషన్ కు దరఖాస్తులు ఆహ్వానం: బాలకిష్టారెడ్డి

సినిమా కథ స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. అప్పటి వరకూ కలిసి ఉన్న ఈ ఫ్రెండ్స్ అనుకోకుండా ఒక రాజకీయ నాయకుడి కుమార్తెతో ప్రేమలో చిక్కుకుంటారు. ఆ తర్వాత జరిగే సంఘటనలు, పొరపాట్లు, గందరగోళాలు ఈ కథకు హాస్యాన్ని అందిస్తాయి. “మిత్ర మండలి” అనే పేరు ఫ్రెండ్షిప్ స్పిరిట్‌కి ప్రతీకగా నిలుస్తుంది. స్నేహం అంటే ఎలాంటి ఆనందాన్ని ఇచ్చేదో ఈ సినిమా చూపించబోతోందని దర్శకుడు విజయేందర్ ఎస్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం అందించినది ఆర్.ఆర్. ధృవన్. పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంటున్నాయి. సినిమాను బన్నీ వాసు సమర్పణలో, బి.వి. వర్క్స్ బ్యానర్‌పై నిర్మించారు. థియేటర్‌లో ఫుల్ ఫన్ గ్యారంటీతో ప్రేక్షకులు నవ్వుల విందు ఇవ్వ బోతుందని నిర్మాత బన్నీ వాసు తెలిపారు.

Read also-Srikanth Bharath: జాతి పిత గురించి నటుడు శ్రీకాంత్ భరత్ అలా అనేశాడేంటి?

ఇటీవల విడుదలైన ట్రైలర్ యూత్‌ఫుల్ ఎనర్జీతో నిండి ఉంది. “మిత్ర మండలి” ట్రైలర్ చూసిన సినీ ప్రేమికులు ఇది సరదా స్నేహితుల కథ అని అభిప్రాయపడ్డారు. ప్రియదర్శి టైమింగ్, కామెడీ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వెన్నెల కిషోర్ ఎంట్రీతో మొదలవుతోంది సినిమా. ట్రైలర్ లో వచ్చన ప్రతి డైలాగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. సత్య కామెడీ టైమింగ్ అయితే అదరగొడుతుంది. సుబ్బారావ్ అనే పాత్ర చాల ప్రాముఖ్యత కలిగిన పాత్రలా కనిపిస్తుంది. అందులో బ్రహ్మనందం సుబ్బారావుగా కనిపిస్తారు. ఓవరాల్ గా ఈ సినిమా దీపావళికి ఫన్ బాంబ్ పేల్చేలా కనిపిస్తుంది. విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. చివర్లో జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కూడా కూడా వచ్చి అందరినీ నవ్విస్తాడు.

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!