Ramachandra Rao: బీసీ రిజర్వేషన్లపై కోర్టులో కేసులు వేయించడం వెనుక బీజేపీ(BJP) ఎంపీలు ఎవరూ లేరని, కాంగ్రెస్(Congress) ఎంపీలే ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) వ్యాఖ్యానించారు. కాంగ్రెస్(Congress) ఎంపీ(MP)లే చెప్పి మరీ కేసులు వేయించారని ఆయన ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో ఎవరో పిటిషన్ వేశారని, అయితే హై కోర్టులో తీర్పు పెండింగ్ ఉండగా సుప్రీంకోర్టు దీనిపై జోక్యం చేసుకోదని, అందులో భాగంగానే డిస్మిస్ చేసిందని తెలిపారు. సుప్రీంకోర్టులో ఏం జరిగిందని మంత్రులు దీన్ని స్వాగతిస్తున్నారో అర్థంకావడం లేదని ఆయన ఎద్దేవాచేశారు.
రాంచందర్ రావు ఫైర్
రిజర్వేషన్ల అంశంపై మంత్రులు ఏదో సాధించామన్నట్లు ఢిల్లీకి వెళ్లారని ఎద్దేవాచేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రులు కేవలం పబ్లిసిటీ కోసమే ఢిల్లీకి వెళ్లారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో చూసుకోమ్మని సుప్రీంకోర్టు చెబితే.. అది సాధించినట్టా అని ప్రశ్నించారు. ఈమాత్రం దానికి ఏదో సాధించినట్లు డ్రామా, నాటకాలాడుతున్నారని ఆయన విమర్శలు చేశారు. మంత్రులు రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని రాంచందర్ రావు ఫైరయ్యారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో వాదనలు వినిపించాలని సూచించారు. 42 శాతం కేవలం బీసీలకే రిజర్వేషన్లు కల్పిస్తామంటే తమ పూర్తి మద్దతు ఉంటుందని గతంలోనే చెప్పామని రాంచందర్ రావు గుర్తుచేశారు. బీజేపీపై అభాండాలు వేయడం తప్పా, కాంగ్రెస్ కు బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. ఉప ఎన్నికల్లో గెలవబోమనే భయంతోనే కాంగ్రెస్ కోర్టులో కేసులు వేయించిందన్నారు.
Also Read: Gold Rate Today: షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. ఎంత పెరిగిందంటే?
ఉచిత బస్సు అని చెప్పి..
ఇకపోతే హరీశ్ రావు(Harish Rao)కు మతిమరుపు వచ్చినట్టుందని, ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా అహంకారం పోలేదని ఫైరయ్యారు. అహంకారపు మాటల వల్లనే బీఆర్ఎస్(BRS) కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఇంకా అదే అహంకారం ఉంటే జూబ్లీహిల్స్ లో కూడా ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని వివరించారు. ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల్లో అభ్యర్థులు కూడా లేని దిక్కులేని పార్టీ బీఆర్ఎస్(BRS) అని, అలాంటి పార్టీకి తమను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు అని చెప్పి ఇప్పుడు ప్రజల నడ్డి విరుస్తోందని ఆగ్రహ వ్యక్తంచేశారు. ఒక చేత్తో ఫ్రీ అంటూనే.., మరో చేత్తో లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ(RTC) చార్జీల పెంపును బేషరతుగా తగ్గించాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర ఎలక్షన్ కమిటీతో సమావేశం తర్వాత తమ అభ్యర్థిని ప్రకటిస్తామని, రెండు, మూడ్రోజుల్లో పూర్తిచేస్తామని ఆయన స్పష్టంచేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో బలమైన అభ్యర్థిని నిలబెట్టబోతున్నామని, ప్రజలు తమను ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉందన్నారు.
Also Read: Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సై.. బీ ఫామ్ ల కోసం ఆశావహులు ప్రయత్నాలు
