Bigg Boss Telugu Day 29 Promos
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss Telugu 9: డే 29 నామినేషన్స్ ట్విస్ట్ అదిరింది.. ఇమ్యూనిటీ టాస్క్‌లో రేలంగి మావయ్య!

Bigg Boss Telugu 9: ఆదివారం బిగ్ బాస్ హౌస్ నుంచి కామనర్ హరిత హరీష్ (Haritha Harish) ఎలిమినేటైన విషయం తెలిసిందే. ఆయన ఎలిమినేట్ అయినట్లుగా ముందుగానే లీక్స్ వచ్చేయడంతో.. ఈ విషయం పెద్దగా ఆసక్తి కలిగించలేదు. ఆదివారం కింగ్ నాగ్ ఎపిసోడ్ అనంతరం వచ్చే సోమవారం ఎపిసోడ్‌లో మళ్లీ ఇంటి నుంచి ఈ వారం బయటకు వెళ్లేందుకు నామినేషన్స్ మొదలవుతాయి. దీంతో ఈ వారం ఎవరు నామినేషన్స్ లిస్ట్‌లో ఉంటారనేది ఆసక్తికరంగా ఉంటుంది. డే 29, సోమవారం ఎపిసోడ్‌కి సంబంధించి రెండు ప్రోమోలు విడుదలయ్యాయి. వీటిలో నామినేషన్స్ ట్విస్ట్ అదిరిపోతే.. అనంతరం ఇమ్యూనిటీ టాస్క్‌ హౌస్‌ని హీటెక్కించింది. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా. ముందుగా ప్రోమో 1 విషయానికి వస్తే..

Also Read- OG Collections: విధ్వంసం.. ‘ఓజీ’ మూవీ 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మొత్తం ఎంతంటే?

బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ అదిరింది

బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ లైన్‌లో నిలబెట్టి.. ‘బిగ్ బాస్ సీజన్ 9 నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు’ అంటూ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ నిజంగా అదిరింది. ఒక్కో కంటెస్టెంట్ షాక్ అయ్యేలా.. బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారంటే.. ఏం జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు. సరే, అసలు విషయంలోకి వస్తే.. నామినేషన్స్ ఏమీ లేకుండానే ప్రక్రియ ముగిసిందని బిగ్ బాస్ అనగానే అంతా షాకయ్యారు. ఈ వారం నామినేషన్స్‌లో కెప్టెన్ రాము తప్ప.. అందరూ నామినేషన్స్‌లో ఉన్నట్లుగా బిగ్ బాస్ చెప్పాడని కంటెస్టెంట్స్ చర్చలు మొదలు పెట్టారు. ఇది చదరంగం కాదు.. రణరంగం అంటూ హౌస్‌మేట్స్ అందరూ నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. వెంటనే ‘ఈసారి మీరు చేసే యుద్ధం.. ఇమ్యూనిటీ కోసం’ అని చెప్పి, ఒక పెద్ద బెడ్ వేసి అందరినీ దానిపై ఎక్కించి, ఎవరైతే ఎక్కువ సేపు దానిపై ఉంటారో వారికి ఇమ్యూనిటీ వస్తుందని, మిగిలిన సభ్యులను ఒక్కొక్కరిని బెడ్ పై నుంచి మిగతా వారు దింపేయాలని బిగ్ బాస్ సూచించారు. రాము, ఫ్లోరా మినహా అందరూ బెడ్ పై యుద్ధానికి సిద్ధమయ్యారు. ఎవరిని కిందకు నెట్టేయాలి? అనే దానిపై అందరూ చర్చలు మొదలెట్టారు. ముందుగా సంజనను, సుమన్ శెట్టిని కిందకు నెట్టేశారు. అనంతరం దివ్యని నెట్టివేస్తుంటే.. ఆమె ఎదురుదాడికి దిగింది. మాటలతో యుద్ధం చేసింది. ఫైనల్‌గా ఆమె కూడా కిందకు నెట్టివేయబడింది. శ్రీజ, దివ్యల మధ్య కూడా వాగ్వివాదం నెలకొంది. అనంతరం భరణి, డెమాన్ పవన్ ఒకరినొకరు నెట్టుకున్నారు. డెమాన్ పవన్ ఎలిమినేట్ అయినట్లుగా ఫ్లోరా చెప్పింది. ఆయన పడ్డారనే నేను వదిలాను అంటూ డెమాన్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మొదటి ప్రోమో ఇలా సాగింది.

Also Read- Kantara Chapter 1: వేట మొదలైంది.. నాలుగు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ఇంట్లో రేలంగి మావయ్య

ఇంక రెండో ప్రోమో విషయానికి వస్తే.. ఇమ్ము, తనూజల మధ్య పుష్ప, శ్రీవల్లి కథ నడుస్తుంది. తనూజ దగ్గరకు వెళ్లి.. శ్రీవల్లి ఫీలింగ్స్ వస్తున్నాయ్ అని ఇమ్ము అనగానే.. కైపుగా ఆమె చూసిన చూపు వావ్ అనేలా ఉంది. వెంటనే కౌంటర్ రీతూ నుంచి వచ్చింది. నీకు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వచ్చేవే అవి.. అని రీతూ ఇచ్చిన కౌంటర్ బాగా పేలింది. ఇమ్ము, రీతూల మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. కళ్యాణ్ వెళ్లి రీతూకి సారీ చెబితే.. ఎందుకు సారీ చెబుతున్నావ్ అని రీతూ అడిగింది. ఇంకోసారి నా మీద అరవకు.. కావాలంటే నన్ను రూమ్‌కి తీసుకెళ్లి తిట్టు అని రీతూ, కళ్యాణ్ మధ్య దువ్వుడు యవ్వారం నడిచింది. అనంతరం మళ్లీ ఇమ్యూనిటీ టాస్క్ మొదలైంది. రీతూ ఎలిమినేట్ అయిన అనంతరం ఫైనల్ రౌండ్ మొదలైంది. ఫైనల్ రౌండ్‌లో శ్రీజని భరణి కిందకు నెట్టివేశారు. శ్రీజ నోరేసుకుని భరణిపై పడుతుంది. ఇంట్లో రేలంగి మావయ్యలా నటిస్తున్నావని అందరూ అంటుంది నిజమే అని శ్రీజ టార్గెట్ చేసింది. మొత్తంగా చూస్తే.. ఈ రెండు ప్రోమోలతో ఈ రోజు ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉండబోతుందనేది అర్థమవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?