Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు (Local Body Elections) సమరానికి సై అంటున్న అభ్యర్థులు. ఇప్పటికే ఎన్నికలకు (Local Body Elections) )ఈసీ షెడ్యూల్ విడుదల చేయగా గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు అభ్యర్థులు ఎవరికి వారు పోటీలు పడుతున్నారు. ఏన్కూరు మండలంలోని ఎన్నికల హడావుడి వాడి వేడిగా కొనసాగుతుంది. అభ్యర్థులు ఎవరికివారు పోటీలు పడుతూ బిఫామ్ ల కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. స్థానిక మండలంలోని 25 గ్రామపంచాయతీలకు ఉండగా మొత్తం ఓటర్ల జాబితా 27,920 మంది కాగా ఇందులో మహిళా ఓటర్లు 13390 మంది పురుషులు ఓటర్లు 14530 ఉన్నారు.
Also Read: Local Body Elections: పల్లెల్లో స్థానిక సందడి ఎన్నికల్లో పోటీ చేసేందుకు.. ఆశావహుల ఉత్సాహం!
25 గ్రామపంచాయతీలకు 216 వార్డులు
ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లలో భాగంగా. మండలంలోని పది ఎంపిటిసి వార్డులకు ఐదు వార్డులు జనరల్ కేటాయించగా. మరో ఐదు స్థానాలు ఎస్టీలకి కేటాయించడం జరిగింది. 25 గ్రామపంచాయతీలకు 216 వార్డులు ఉండగా ఇందులో 25 గ్రామపంచాయతీలకు సర్పంచ్ అభ్యర్థులను ఎస్టీలకే కేటాయించారు. మండల ఎంపీపీగా ఎస్టి మహిళకు కేటాయించగా జడ్పిటిసి అభ్యర్థి జనరల్ కేటాయించారు.
గ్రామాల్లో ఎన్నికల హడావుడి వాడి వేడిగా
ఈ సందర్భంగా గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు అభ్యర్థులు ఎవరికివారు విస్తృతంగా ఓటర్లు కార్యకర్తలతో చర్చలు జరుపుకొని, అభ్యర్థులు బిఫామ్ ల కోసం ఎవరికి వారు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు పోటీ చేసే అభ్యర్థులు. కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవటంలో విలీనం అయ్యారు. ఇదిలా ఉండగా బిఫామ్ లు రాని అభ్యర్థులు ఇండిపెండెంట్ కి పోటీచేసే ఆశావాహులు కూడా ఎక్కువ అవుతున్నారు. ఏది ఏమైనా గ్రామాల్లో ఎన్నికల హడావుడి వాడి వేడిగా కొనసాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీ నేతలుఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరోవైపు హైకోర్టు తీర్పు ఏం చెబుతుందో అని కూడా చర్చించుకుంటున్నారు.
Also Read: Tribanadhari Barbarik OTT: చెప్పుతో కొట్టుకున్న దర్శకుడి సినిమా ఓటీటీలోకి.. ఎప్పుడంటే?
