Protein Rich Foods ( Image Source: Twitter)
Viral

Protein Rich Foods: వీటిని తింటే ఇక గుడ్డు, చికెన్‌ అవసరం లేదు.. అధిక ప్రోటీన్స్ ఉండే శాకాహారాలు ఇవే..!

Protein Rich Foods: మన శరీరానికి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఎంత అవసరమో, ప్రోటీన్ కూడా అంతే ముఖ్యం. కండరాల బలోపేతం, రిపేర్, శక్తి సరఫరా, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఇవన్నీ ప్రోటీన్ లేకుండా అస్సలు సాధ్యం కాదు. చాలామంది ప్రోటీన్ అంటే మాంసం, గుడ్లు అనుకుంటారు, కానీ శాఖాహారులకు కూడా ప్రోటీన్‌తో నిండిన రుచికరమైన, సహజమైన ఫుడ్స్ ఉన్నాయి.

ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక లిస్ట్‌లో, ఒక గుడ్డు (6 గ్రాముల ప్రోటీన్) కంటే ఎక్కువ ప్రోటీన్ అందించే శాఖాహార సూపర్‌ఫుడ్స్‌ను తతెలిపారు. ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకుంటే, ప్రోటీన్ గురించి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. రండి, ఈ ప్రోటీన్స్ గురించి తెలుసుకుందాం..

1. సోయా చంక్స్ (52 గ్రా): ప్రోటీన్‌లో రాజా ఇది. సోయా చంక్స్‌ను శాఖాహార ప్రోటీన్‌లో ‘కింగ్’ అని పిలవొచ్చు. 100 గ్రాముల్లో ఏకంగా 52 గ్రాముల ప్రోటీన్. కూరల్లో, సలాడ్స్‌లో, లేదా గ్రిల్ చేసి – ఎలా వండినా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. శాఖాహారులకు ఇది బెస్ట్ ఛాయిస్.

2. పనీర్ (14 గ్రా): రుచికరమైన ప్రోటీన్ బాంబ్పనీర్ శాఖాహారులకు ఒక బహుముఖ వంటకం. 100 గ్రాముల్లో 14 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కూరలు, టిక్కా, పరాటాలు, సలాడ్స్. దీనిని ఏ రూపంలోనైనా తీసుకున్నా ఇది మీ డైట్‌కు ప్రోటీన్ బూస్ట్ ఇస్తుంది. ఇంకా, క్యాల్షియం కూడా బోనస్.

3. టెంపే (19 గ్రా): జీర్ణవ్యవస్థకు ఫ్రెండ్ఇండోనేషియన్ స్పెషాలిటీ అయిన టెంపే, పులియబెట్టిన సోయాతో తయారవుతుంది. 100 గ్రాముల్లో 19 గ్రాముల ప్రోటీన్‌తో పాటు, ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

4. టోఫు (10 గ్రా): శాఖాహారుల బెస్ట్ బడ్డీసోయా పాల నుంచి తయారయ్యే టోఫు, 100 గ్రాముల్లో 10 గ్రాముల ప్రోటీన్ అందిస్తుంది. సలాడ్స్, కూరలు, గ్రిల్స్, స్మూతీస్. ఏ వంటకంలోనైనా సులభంగా ఇమిడిపోయే ఈ సూపర్‌ఫుడ్, శాఖాహారులకు రుచి, పోషకాల కలయిక.

5. గ్రీక్ యోగర్ట్ (10 గ్రా): పెరుగుతో పోలిస్తే, గ్రీక్ యోగర్ట్‌లో రెట్టింపు ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాములకు 10 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. స్మూతీస్, డిప్స్, లేదా డైరెక్ట్ స్నాక్‌గా.. ఇది ఆరోగ్యకరమైన, రుచికరమైన ఎంపిక.

6. జనపనార గింజలు (32 గ్రా): సూపర్‌ఫుడ్ స్టార్జనపనార గింజలు చిన్నవైనా, 100 గ్రాముల్లో 32 గ్రాముల ప్రోటీన్‌తో పవర్‌హౌస్! ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ కూడా బోనస్. సలాడ్స్‌లో చల్లుకోండి లేదా స్మూతీలో కలపండి – ఆరోగ్యం డబుల్.

7. వేరుశెనగలు (25 గ్రా): చవకైన ప్రోటీన్ బూస్ట్100 గ్రాముల్లో 25 గ్రాముల ప్రోటీన్‌తో, వేరుశెనగలు అందరికీ అందుబాటులో ఉండే సూపర్‌ఫుడ్. స్నాక్‌గా, చట్నీగా, లేదా కూరలో – ఎలా తిన్నా రుచి, పోషకాలు గ్యారంటీ.

8. బాదం (21 గ్రా): ఆరోగ్యకరమైన కొవ్వులతో ఫుల్ ప్యాక్100 గ్రాముల బాదంలో 21 గ్రాముల ప్రోటీన్‌తో పాటు విటమిన్ E, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. రోజూ ఒక గుప్పెడు బాదం తీసుకుంటే చాలు. ఇది మీ శరీరానికి పవర్ బ్యాంక్.

9. పొద్దుతిరుగుడు విత్తనాలు (21 గ్రా): సలాడ్‌కు రుచి యాడ్100 గ్రాముల్లో 21 గ్రాముల ప్రోటీన్ అందించే ఈ విత్తనాలు, సలాడ్స్, స్మూతీస్, లేదా ఓట్స్‌లో చల్లుకుంటే రుచి, ఆరోగ్యం రెండూ డబుల్ అవుతాయి.

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?