Gadwal District: త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గద్వాల జిల్లాపై గులాబీ జెండా ఎగురవేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇందుకోసం కార్యకర్తలంతా సమష్టిగా ముందుకెళ్లాల్సిన అవసరముందని బీఆర్ఎస్ పార్టీ గద్వాల నియోజక వర్గ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు అన్నారు. గద్వాల (Gadwal District) పట్టణంలో బాసు హనుమంతు నాయుడు స్వగృహం నందు కేటిధొడ్డి మండలం కొండాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా బాసు హన్మంతునాయుడు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను నాయకులు, కార్యకర్తలు ఆషామాషీగా తీసుకోవద్దని, రాత్రిబవంళ్లు కష్టపడి పనిచేస్తేనే మన లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.
జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవల్సిన అవసరం ఉంది
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు. మనమంతా ధైర్యంగా ముందుకెళ్లి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవల్సిన అవసరం ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ముందుకెళ్లి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో కొండాపురం గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి, చిన్న నర్సింరెడ్డి, రఘునాథ్ రెడ్డి, మహానంద రెడ్డి, డోలు వీరన్న, నాగిరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, వీరారెడ్డి, పెద్ద రంగన్న రెడ్డి, తిమ్మారెడ్డితో పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు జి.రాఘవేంద్ర రెడ్డి, వెంకటేష్ నాయుడు, చక్రిధర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, శ్రీరాములు, భరత్ సింహారెడ్డి, గోవిందు, ప్రహ్లాద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Gadwal District: గద్వాల జిల్లాలో సమాచార హక్కు చట్టానికి తూట్లు.. పట్టించుకోని అధికారులు
పేదల కోసం నిరంతరంగా పోరాటం
జిల్లాకేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల్లో జడ్పిటిసి ఎంపిటిసి స్థానాలకు పోటీ చేసే అంశంపై లోతుగా చర్చించి ఎంపిటిసి జడ్పిటిసి స్థానాల్లో పోటీ చేయడానికి ఆ పార్టీ నిర్ణయించినట్లు జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వందేళ్లుగా పేదల కోసం నిరంతరంగా పోరాటం సాగిస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల తరఫున నిలబడుతుందని ప్రజలు ఆదరించి గ్రామాల్లో ఎంపిటిసి, జడ్పిటిసి అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సాధ్యమైనంతవరకు ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందించడంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రంగన్న, పెద్దబాబు ఆశన్న, రవి, కాసిం పరమేష్ కిష్టన్న తదితరులు పాల్గొన్నారు.
Also Read: Indian Origin Shot Dead: అమెరికాలో ఘోరం.. ‘బాగానే ఉన్నావా?’ అన్నందుకు.. భారతీయుడ్ని చంపేశాడు
