Wedding: సాధారణంగా పెళ్లి చేసేటప్పుడు పెద్దలు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేయాలని భావిస్తారు. కానీ, ఈ రోజుల్లో ట్రెండ్ మొత్తం మారిపోయింది. పొద్దున్నే పిల్లని చూశామా.. సాయంత్రం పప్పన్నం తిన్నామా.. మరునాడు పిల్ల మెడలో తాళి కట్టామా అన్నట్లు ఉంది. అమ్మాయి వైపు కానీ, అబ్బాయి వైపు కానీ ఆలోచించే వాళ్లే లేరు. అబ్బాయికి మంచి జాబ్ ఉందంటే చాలు పిల్లని ఇవ్వడానికి తల్లి దండ్రులు కూడా వెనుకాడటం లేదు. ఇక ఈ సమయంలోనే ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. పెళ్ళి చేసుకునే అబ్బాయికి అన్ని లక్షలు ఉండాల్సిందే అంటూ ఓ వ్యక్తి పెట్టిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి, అంతలా ఆ వీడియోలో ఏముందో ఇక్కడ తెలుసుకుందాం..
పెళ్ళికి ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మంగళ సూత్రం – రూ. 4 లక్షలు
కమ్మలు – రూ.1 లక్ష
చీరలు – రూ. 60 వేలు
పెళ్ళికి బట్టలు – రూ.60 వేలు
ఇతర ఖర్చులు – రూ.60 వేలు
పెళ్లి తర్వాత ట్రిప్ – 50 వేలు
డెలివరీ ముందు – రూ. 50 వేలు
డెలివరీకి – 2 లక్షలు
డెలివరీ తర్వాత – 59 వేలు
నామకరణము – రూ. 2 లక్షలు
15 లక్షలు పెట్టుకుని పెళ్ళికి సిద్ధంగా ఉండండి అంటూ పెళ్లి కానీ అబ్బాయిలకు అర్ధం అయ్యేలా ఈ పోస్ట్ పెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
