Ramchandra Rao: గ్రౌండ్ లెవెల్ లో పార్టీ పరిస్థితి అధ్వానం
Ramchandra Rao (imagecredit:twitter)
Political News, Telangana News

Ramchandra Rao: కమలం నేతల అసంతృప్తి.. గ్రౌండ్ లెవెల్ లో పార్టీ పరిస్థితి అధ్వానం అంటున్న నేతలు

Ramchandra Rao: తెలంగాణ కమలం పార్టీలో పలువురు నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. పార్టీలో పలువురి తీరే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సమాయత్తంపై ఆదివారం స్టేట్ ఆఫీస్ బేరర్ల సమావేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) అధ్యక్​షతన జరిగింది. ఈ సమావేశం వాడీవేడీగా సాగినట్లు పలువురు చెబుతున్నారు. కాగా ఈ మీటింగులో పలువురు ఎం(MP)పీలు, ఎమ్మెల్యే(MLA)లు పార్టీలోని లూప్ హోల్స్ పై ప్రశ్నించినట్లు తెలిసింది. పార్టీలో నేతల మధ్య సమన్వయ లోపం, కార్యక్రమాలు చేపట్టడంపై నిర్లక్ష్యం వహించడం వంటి అంశాలపై రాష్​ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(MP Konda Vishweshwar Reddy), కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(Venkata Ramana Reddy) ఈ అంశాలను లేవనెత్తినట్లు చెబుతున్నారు.

సరైన నేతలకే ఇన్ చార్జీ బాధ్యతలు

స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీజేపీలో నేతల మధ్య సమన్వయం కొరవడటంపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల తీరు ఏమాత్రం బాగోలేదని, సరైన కోఆర్డినేషన్ లేదంటూ కొండా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. దీంతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ఇష్యూపై కమిటీ వేస్తామని రాంచందర్ రావు కొండాకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. కాగా పాలమూరు ఎంపీ డీకే అరుణ సైతం సరైన నేతలకే ఇన్ చార్జీ బాధ్యతలు అప్పగించాలని సూచించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రాష్ట్ర నాయకత్వం తీరుపై మరింత ఘాటుగా స్పందించినట్లు తెలిసింది. పార్టీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కూర్చోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించినట్లు సమాచారం. అంతేకాకుండా పార్టీ కార్యాలయంలో కూర్చొని కార్యక్రమాలు డిసైడ్ చేయడం వరకే సరిపోతోందని, కానీ క్షేత్రస్థాయిలో ఆ కార్యక్రమమే చేపట్టడంలేదంటూ రాష్ట్ర నాయకత్వం తీరును ఎండగట్టారు. అలాంటప్పుడు ఫలితాలు ఎలా వస్తాయని ప్రశ్నించినట్లు సమాచారం. గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా మారిందని కాటిపల్లి ఆందోళన వ్యక్తంచేసారు.

Also Read: Local Body Elections: గ్రామాల్లో ఊపందుకున్న స్థానిక ఎన్నికలు.. మద్దతు ఇస్తే మాకేంటి అంటున్న వర్గాలు

చెక్ పెట్టడంపై ఫోకస్..

బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తంచేయడంతో పార్టీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు కలుగజేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అన్నింటినీ సరిచేసుకొని సమష్టిగా ముందుకెళ్దామని ఆయన సూచనలు చేసినట్లు చెబుతున్నారు. పార్టీలో ఇంటర్నల్ సమస్యలకు చెక్ పెట్టడంపై ఫోకస్ చేస్తామని చెప్పినట్లు తెలిసింది. కాగా ఈనెల 8న స్థానికసంస్థల ఎన్నికలపై రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించుకుని ముందుకు వెళ్దామని స్టేట్ ఆఫీస్ బేరర్లకు రాంచందర్ రావు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. జిల్లాకు ఒక అధ్యక్షుడు, ఇన్ చార్జీ, అబ్జర్వర్ తో త్రిసభ్య కమిటీ వేస్తామని, త్వరలో జిల్లాల వారీగా భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తామని సూచనలు చేసినట్లు తెలిసింది. కాగా ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో 15 జెడ్పీ చైర్మన్ స్థానాలను గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాంచందర్ రావు వారికి వివరించినట్లు తెలిసింది. కాగా ఇన్ని సమస్యల నడుమ 15 జెడ్పీ చైర్మన్ స్థానాల్లో కాషాయ పార్టీ విజయబావుటా ఎగురవేయగలదా? అనే అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమతువున్నాయి. ఒకవైపు పలు జిల్లాల్లో అసలు లీడర్, కేడర్ కూడా పార్టీకి లేరు. ఒకవైపు పలు జిల్లాల్లో అసలు లీడర్, కేడర్ కూడా పార్టీకి లేరు. మరోవైపు ఉన్న ప్రాంతాల్లోనూ నేతల మధ్య కోల్డ్ వార్, కోఆర్డినేషన్ లేక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ సమస్యలను పార్టీ ఎలా అధిగమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: Sasivadane: ఇందులో ఎటువంటి అశ్లీలత ఉండదు.. ఇలాంటి క్లైమాక్స్ ఇప్పటి వరకు చూసుండరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..