Local Body Elections (imagecredit:twitter)
తెలంగాణ

Local Body Elections: గ్రామాల్లో ఊపందుకున్న స్థానిక ఎన్నికలు.. మద్దతు ఇస్తే మాకేంటి అంటున్న వర్గాలు

Local Body Elections: స్థానిక సంస్థల్లో పోటీకి ఆశావాహులు ఆసక్తి చూపుతున్నారు. రిజర్వేషన్లు మారడంతో పోటీకి సై అంటున్నారు. ఎక్కువ మంది పోటీపడుతుండటంతో వారి మధ్య బేరసారాలు స్టార్ట్ అయ్యాయి. సహకరించినందుకు వారికి డబ్బులతో రాజీ కుదుర్చుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు నేతల మధ్య ఏకాభిప్రాయం కోసం పార్టీ గ్రామకమిటీల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓకే అభ్యర్థి పోటీచేసేలా చర్చలు జరుపుతున్నారు. పార్టీ నేతలు తీర్మాణాలు సైతం చేస్తున్నారు.

సర్పంచ్ టికెట్ ఇస్తే గెలుస్తా..

రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధమైంది. రాష్ట్రంలోని 12733 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించబోతుంది. బీసీ(BC)లకు42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండటంతో 5,359 గ్రామపంచాయతీలు దక్కనున్నాయి. దీంతో పోటీకి ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. ఒక్కసారైన సర్పంచ్ అయ్యి.. చిరకాల కోరిన తీర్చుకోవాలని భావిస్తున్నారు. దీంతో ఒక్కోపార్టీ నుంచి ముగ్గురు నలుగురు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. గ్రామాల్లో ఆయా వర్గాలను మచ్చిక చేసుకునేందుకు సంప్రదింపులు చేస్తున్నారు. తమకు ఇంతమంది, ఫలానా వర్గం సహకరిస్తుందని, తనకు సర్పంచ్ టికెట్ ఇస్తే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారుగా ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రభావం గెలుపోటములపై పడుతుందని భావించిన పార్టీ సీనియర్ నేతలు ఆశావాహులతో భేటీలు నిర్వహిస్తున్నారు. వారి అభిప్రాయం తెలుసుకుంటున్నారు. ఇతరులకు టికెట్ ఇస్తే సహకరిస్తారా? లేదా? అనే వివరాలపై ఆరా తీస్తున్నారు.

ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి టికెట్..

మరోవైపు ఆశావాహులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో పార్టీ గ్రామశాఖల సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేతలందరిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. ఒకరు పోటీ చేస్తే మిగిలిన ఇద్దరుముగ్గురు ఆశావాహలు సహకరించేందుకు బేరసారాలు స్టార్ట్ చేశారు. ఒక్కోక్కరికి 2 నుంచి 3లక్షలు ఇచ్చేందుకు తీర్మానం చేస్తున్నట్లు సమాచారం. పార్టీ స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి టికెట్ కోసం ఏకాభిప్రాయానికి వచ్చామని తెలుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేగానీ, మాజీ ఎమ్మెల్యేగానీ ఎవరిపేరును ప్రతిపాదించినా మిగిలిన వారు సహకరించేందుకు సైతం ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఎన్నికలు కంప్లీట్ అయ్యేవరకు పోటీచేసిన వ్యక్తికి సహకరిస్తామని హామీని సైతం తీసుకుంటున్నారు. అందుకుకోసం ఆర్థిక ఒప్పందం చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Also Read: Ramreddy Damodar Reddy: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. సీనియర్ నేత కన్నుమూత.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

ఈజీగా గెలుస్తామని ధీమా..

అధికారపార్టీ నుంచి ఎక్కువమంది పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress) అధికారంలో ఉండటంతో ఆపార్టీ నుంచి పోటీచేస్తే గ్రామానికి నిధులు వస్తాయని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని భావిస్తున్నారు. అంతేగాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఈజీగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోటీకి ఎక్కువమంది ఆసక్తి చూపుతూ ముందుకు వస్తున్నారు. డబ్బులు ఎక్కువగా ఖర్చుచేసేవారికే టికెట్లు ఇవ్వాలని గ్రామకమిటీ సైతం భావిస్తుంది. అందుకోసం ముందే ఎంతఖర్చుచేస్తారని అలా హామీ ఇచ్చినవారికే టికెట్ ఖరారుచేస్తామని ఖరాఖండిగా చెబుతున్నట్లు సమాచారం. అంతేగాకుండా ప్రధానప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి కూడా ఇద్దరు, ముగ్గురు పోటీకి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు.

పోటీ చేసేందుకు ఆసక్తి..

ఇది ఇలా ఉంటే గ్రామపంచాయతీ లకు రిజర్వేషన్లు మారడం, ఏళ్ల తర్వాత ఎస్సీ(SC), ఎస్టీ(ST) రిజర్వేషన్ల నుంచి బీసీ(BC)లకు రావడంతో ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వచ్చిన గ్రామాల్లో మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఓసీ జనరల్ వచ్చిన గ్రామాల్లో మాత్రం ఎక్కువ మంది పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నవారు పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్నా అవకాశం లేకపోవడంతో నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి స్టార్ట్ అయింది.

Also Read: Sujeeth: ‘ఓజీ’ నిర్మాత అలా అడిగే సరికి.. నా నోటి నుంచి మాట రాలేదు

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?