Dude movie: ప్రదీప్ రంగనాధన్ హీరోగా రూపొందుతున్న డ్యూడ్ సినిమా గురించి దర్శకుడు కీర్తీశ్వరన్ ఆసక్తికర కామెంట్లు చేశారు. అసలు డ్యూడ్ సినిమా ప్రదీప్ రంగనాధన్ గురించి రాసుకున్నది కాదని బాంబ్ పేల్చాడు. అసలు ఈ సినిమాని సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా, శ్రీ దేవి హీరోయిన్ గా ఊహించుకుని రాసుకున్న సినిమా అని అన్నారు. ‘డ్యూడ్’ కథకు ప్రదీప్ రంగనాధన్ సరిగ్గా సరిపోతాడని అందుకే ఆయనతో సినిమా తీస్తున్నానని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా హీరోయిన్ అయిన మమితా కూడా ప్రేమలు కంటే ముందే ఈ సినిమాలో పార్ట్ అయిందంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో 30 ఏళ్ల క్రితం రజనీ కాంత్ శ్రీ దేవి కాంబినేషన్ ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుందన్నారు. దీనిని చూసిన రజనీ అభిమానులు 30 ఏళ్ల క్రితం రజనీ కాంత్ ఎలా ఉండబోతున్నారో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. రజనీ అభిమానులు అక్టోబర్ 17న సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.
తమిళ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాధన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్యూడ్ (Dude)’. దీపావళి కానుకగా అక్టోబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘లవ్ టుడే’ తర్వాత ప్రదీప్ నటించిన ఈ చిత్రం రొమాంటిక్, కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ కలగలిపిన యూత్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించగా, ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సోషల్ మీడియాలో హిట్ అయ్యాయి. తాజాగా మరో సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నిర్మాతలు. అదే “సింగారి” సాంగ్. ఈ పాటను ప్రదీప్ స్వయంగా పాడటంతో అభిమానుల్లో ఉత్సాహం రేపుతోంది.
ఈ సినిమా కథలో ప్రదీప్ పాత్ర ఒక మాస్ అటిట్యూడ్ ఉన్న యువకుడి చుట్టూ తిరుగుతుంది. కానీ ఇందులో ప్రేమతో పాటు కుటుంబ సెంటిమెంట్ కూడా ప్రధానంగా ఉండబోతుందని సమాచారం. సినిమాకి సంబంధించిన ట్రైలర్, పోస్టర్లు ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ప్రదీప్, మమితా జోడీ తెరపై సూపర్ హిట్ కెమిస్ట్రీగా మారుతుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే “డ్యూడ్” సినిమాకి సంబంధించిన డిజిటల్ హక్కులను ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ మొత్తానికి దక్కించుకుందని సమాచారం. దీపావళి రేసులో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డ్రాగెన్ మూవీ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావండంతో ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
