Ram Gopal Varma: ‘శివ’ సినిమా విడుదలై అప్పడు ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ కెరోర్ లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోయింది. 1989 అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా నేటికి 36 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ఆర్జీవీ ఏం చెప్పారంటే.. ‘ఈ రోజు శివ సినిమా పుట్టిన రోజు.. సినిమానే కాదు నాది కూడా పుట్టిన రోజే బైలాజికల్ గా కాకపోయినా సినిమా పరంగా నాకు ఈ రోజు పుట్టిన రోజే. నాకు ఈ సినిమా జన్మనిచ్చింది. కింగ్ నాగార్జునతో తీసిన ‘శివ’ సినిమా. ఈ సినిమా నాకు అమ్మతో సమానం హ్యాపీ బర్తడే అమ్మా’ అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ పోస్ట్ కు ఫిదా అవుతున్నారు. ఎప్పుడూ మనం నడిచి వచ్చిన దారి మర్చిపోకూడదంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read also-Mahabubabad District: పల్లెల్లో రాజుకుంటున్న రాజకీయ వేడి.. గంగారం మండలం పై ఫుల్ ఫోకస్
తెలుగు సినీ చరిత్రలో ఒక మలుపు తీసుకువచ్చిన చిత్రం అంటే అది రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1989లో వచ్చిన “శివ”. నాగార్జున, అమల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కాలేజీ నేపథ్యంలో జరిగే విద్యార్థి రాజకీయాలు, గ్యాంగ్ వార్స్ చుట్టూ తిరుగుతుంది. ఒక సాధారణ యువకుడు సిస్టమ్‌కు వ్యతిరేకంగా ఎలా నిలబడతాడో చూపించిన ఈ కథ, తన యాక్షన్ సన్నివేశాలు, నిజజీవితానికి దగ్గరగా ఉన్న ప్రదర్శనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా సైకిల్ చైన్ ఫైట్ సీన్ సినిమాకు ఐకానిక్ సీక్వెన్స్‌గా మారింది. రఘువరన్ చేసిన విలన్ పాత్ర, నాగార్జున పెర్ఫార్మెన్స్, ఇళయరాజా సంగీతం అన్నీ కలిసి సినిమాను ఒక సూపర్ హిట్ మూవీగా మలిచాయి.
Read also-Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ చూసిన ఫ్యాన్స్ థియేటర్లో ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్..
శివ చిత్రం తెలుగు సినిమాకు కొత్త దిశను చూపించడమే కాకుండా, రామ్ గోపాల్ వర్మను దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టింది. సాంకేతిక నాణ్యత, కెమెరా యాంగిల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ కాలానికి మించి ఉండి, కొత్త తరం దర్శకులకు స్ఫూర్తిగా నిలిచాయి. “శివ” ప్రభావం తరువాతి దశాబ్దాల తెలుగు సినిమాల మీద స్పష్టంగా కనిపించింది. ఇప్పటికీ ఈ చిత్రం ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచి, రీ-రిలీజ్ ద్వారా కొత్త తరం ప్రేక్షకులకు మరోసారి ఆ యుగాన్ని గుర్తు చేస్తోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించిన క్లాసిక్ చిత్రం “శివ” ఇప్పుడు 4K రీమాస్టర్డ్ వెర్షన్‌గా మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. ఈ 4K వెర్షన్‌ను డాల్బీ ఆట్మాస్ సౌండ్‌తో రూపొందించి, నవంబర్ 14, 2025న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇది అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా రీ-రిలీజ్ అవుతోంది.
Hey OCTOBER 5 th is not only SHIVA’S Birthday , but it’s MY BIRTHDAY too ! That’s because my biological mom gave me a BIOLOGICAL BIRTH whereas @iamnagarjuna gave me CAREER BIRTH ! Happy MOM’S DAY NAG! 🙏🙏🙏 pic.twitter.com/SMK6g1BPBp
— Ram Gopal Varma (@RGVzoomin) October 5, 2025
