Ramchander Rao (image credit:twitter)
తెలంగాణ

Ramchander Rao: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికకు త్రీ మెన్ కమిటీ.. ముఖ్య నేతలు వీళ్ళే!

Ramchander Rao: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో బీజేపీ(BJP) సైతం ఫోకస్ పెంచింది. అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్(BRS) ఇతర పార్టీల కంటే ఒకడుగు ముందుంది. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు టికెట్ కన్ఫామ్ చేసింది. ఇదిలా ఉండగా బీజేపీ సైతం అభ్యర్థి ఎంపికకు త్రీ మెన్ కమిటీ(Three-man committee)ని నియమించింది. ఈ కమిటీలో మాజీ ఎమ్మెల్యే ఎం ధర్మారావు(M Dharma Rao), మాజీ ఎంపీ పోతుగంటి రాములు(Pothuganti Ramulu_, బీజేపీ సీనియర్ లీడర్, అడ్వకేట్ కోమల ఆంజనేయులు(Komala Anjaneyulu)కు పార్టీ రాష్ట్ర నాయకత్వం చోటు కల్పించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Also Read: Crime News: ఆటో డ్రైవర్ ఘరానా మోసం.. వృద్ధుడి సెల్ ఫోన్​ కొట్టేసి ఆపై ఎంచేశాడంటే?

నేతలు ప్రయత్నాలు

కాగా ఈ కమిటీ పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకుని జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఫైనల్ చేయనుంది. ఇదిలా ఉండగా ఈ స్థానం నుంచి పోటీకి పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. జూటూరి కీర్తిరెడ్డి, లంకల దీపక్ రెడ్డి ప్రధానంగా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మానిటరింగ్ కమిటీని పార్టీ నియమించింది. తాజాగా అభ్యర్థి ఎంపికకు మరో కమిటీని నియమించడం గమనార్హం. మరి ఈ కమిటీ ఎవరిని ఫైనల్ చేస్తుందనేది చూడాలి.

నేడు బీజేపీ స్టేట్ బేరర్స్ మీటింగ్

స్థానిక సంస్థల ఎన్నికలపై కాషాయ పార్టీ కసరత్తు చేపడుతోంది. అందులో భాగంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం స్టేట్ ఆఫీస్ బేరర్లతో సమావేశం నిర్వహించనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన ఈ సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభంకానుంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో రచించాల్సిన వ్యూహాలపై ఈ మీటింగులో సమాలోచనలు చేసే అవకాశాలున్నాయి.

Also Read: Local Body Elections: హుజూరాబాద్ బీఆర్‌ఎస్‌లో ముసలం.. వీణవంక జెడ్పీటీసీ టికెట్ కోసం కోల్డ్ వార్!

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?