Damodar Rajanarsimha (imagecredit:swetcha)
తెలంగాణ

Damodar Rajanarsimha: స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం టాప్ గేర్: మంత్రి దామోదర రాజనర్సింహ

Damodar Rajanarsimha: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్(Mahabubnagar) జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతున్నదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha) ధీమా వ్యక్తం చేశారు. పార్టీ, ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని ఆయన తెలిపారు.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర్ రాజనర్సింహ శనివారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో సమావేశం నిర్వహించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao), వాకిటి శ్రీహరి(Vakiti Srihari), ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకరయ్య(Veerlapalli Shankaraiah), పర్ణికారెడ్డి(Parnika Reddy), రాజేశ్ రెడ్డి(Rajesh Reddy), గవినొళ్ల మధుసూదన్ రెడ్డి, మేఘా రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

టికెట్ల కేటాయింపులో..

స్థానిక సంస్థల ఎన్నికల్లో అవలంభించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార శైలి, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు ధీటుగా బదులివ్వడం, సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలను ఎదుర్కొని.. ప్రజలకు నిజాలు తెలియజేయడం వంటి పలు అంశాలు సమావేశంలో చర్చించారు. ఆయా అంశాలపై ఎమ్మెల్యేలు, నాయకులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు, నాయకులకు టికెట్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

Also Read: Ponnam Prabhakar: పాతబస్తీలో ట్రా‘ఫికర్’కు చెక్.. అందుబాటులోకి ఫలక్‌నుమా ఆర్ఓబి

నాయకుల మధ్య సమన్వయ లోపం..

టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. నాయకుల మధ్య సమన్వయ లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరువ చేయాలన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను బలంగా తిప్పికొడుతూనే, ప్రజలకు వాస్తవాలు తెలిపేలా కార్యకర్తలను సమాయత్తం చేయాలని మంత్రి సూచించారు.

Also Read: Local Body Elections: హుజూరాబాద్ బీఆర్‌ఎస్‌లో ముసలం.. వీణవంక జెడ్పీటీసీ టికెట్ కోసం కోల్డ్ వార్!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!