Ponnam Prabhakar: పాతబస్తీలోని ట్రాఫికర్‌కు చెక్ పడింది. చిన్న చిన్న రహదార్లలో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతున్న ప్రాంతాల్లో మరో ఆర్వోబీ (Road Over Bridge) అందుబాటులోకి వచ్చింది. జీహెచ్ఎంసీ నిధులు రూ. 52.03 కోట్ల వ్యయంతో నిర్మించిన సికింద్రాబాద్ – ఫలక్‌నుమా బ్రాడ్‌గేజ్ లైన్‌లోని ఫలక్‌నుమా వద్ద ఆర్వోబీకి సమాంతరంగా నిర్మించిన బ్రిడ్జిని శుక్రవారం హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసుదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీలు మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ, మీర్జా రహమత్ బేగ్, ఎమ్మెల్యేలు మహమ్మద్ ముబీన్, మీర్ జల్ఫికర్ అలీ, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్‌లు తదితరులు పాల్గొన్నారు.
Also Read- Akshay Kumar: అలాంటి ఫొటోలను పంపుతారా? తన కుమార్తెకు ఎదురైన షాకింగ్ ఘటనను తెలిపిన అక్షయ్!
తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
పాతబస్తీ ఫలక్‌నుమాలో నేటి నుంచి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. సికింద్రాబాద్ నుంచి ఫలక్‌నుమా బ్రాడ్ గేజ్ లైన్ వద్ద ఉన్న ఆర్వోబీకి సమాంతరంగా జీహెచ్ఎంసీ ఆర్వోబీనీ నిర్మించింది. ఈ నాలుగు లేన్ల ఆర్వోబీతో బార్కాస్ జీ మాక్స్ జంక్షన్ నుంచి ఫలక్‌నుమా బస్ డిపో, రైల్వే స్టేషన్, చార్మినార్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తొలగనున్నాయి. సమయం ఆదాతో పాటు గంటల తరబడి నిలిచిపోయే ట్రాఫిక్ నుంచి వాహనదారులకు ఊరట లభించనుంది. ఫలక్‌నుమా ఆర్‌ఓబీనీ ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తరుచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తే గ్లోబల్ స్కూల్ నుంచి బస్ డిపో వరకు ట్రాఫిక్ వేగంగా కదిలే అవకాశమేర్పడింది.
వాహన దారులకు గొప్ప ఊరట
ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా.. రూ 52.03 కోట్ల వ్యయంతో నిర్మించిన సికింద్రాబాద్ – ఫలక్‌నుమా బ్రాడ్‌గేజ్ లైన్‌లోని ఫలక్‌నుమా వద్ద ఆర్‌ఓబీకి సమాంతర ఆర్‌ఓబీ నిర్మాణంను ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తనతో పాటు పాల్గొన్న ప్రముఖులందరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఈ నిర్మాణంతో పాతబస్తీ ఫలక్‌నుమాలోని ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తొలుగుతాయని, చాలా సమయం కలిసి వస్తుందని అన్నారు. ఇది వాహన దారులకు గొప్ప ఊరటగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్
రూ 52.03 కోట్ల వ్యయంతో నిర్మించిన సికింద్రాబాద్ – ఫలక్‌నుమా బ్రాడ్‌గేజ్ లైన్‌లోని ఫలక్‌నుమా వద్ద ఆర్‌ఓబీకి సమాంతర ఆర్‌ఓబీ నిర్మాణం ను ప్రారంభించడం జరిగిందికార్యక్రమంలో పాల్గొన్న మేయర్ గద్వాల విజయ లక్ష్మీ గారు ,రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు , హైదరాబాద్… pic.twitter.com/EOq6duzodA
— Ponnam Prabhakar (@Ponnam_INC) October 3, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
