Keesara: బైక్ పక్కకు తీయమన్నందుకు కీసరలో తంబీల లొల్లి..
Tamilian Fight in Telangana
Telangana News

Keesara: కీసరలో తమిళ తంబీల లొల్లి.. బైక్ పక్కకు తీయమన్నందుకు రచ్చ

Keesara: మార్వాడీ గో బ్యాక్ ఆందోళనలు సృష్టించిన దుమారాన్ని మరిచిపోక ముందే తమిళ తంబీలు రెచ్చిపోయారు. అడ్డుగా ఉన్న బైక్‌ను పక్కకు జరపమని చెప్పిన పాపానికి ఓ ఆటోడ్రైవర్ పై రెచ్చిపోయారు. తమ వాళ్లను పిలిపించుకుని రచ్చ రచ్చ చేశారు. దాంతో అవతలి వర్గం వారు కూడా బాహాబాహీకి సిద్ధమవటంతో తీవ్ర ఉద్రక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ వ్యక్తి.. దసరా ముందు రోజు రోడ్డు మీదకు వచ్చాడు. ఆటోను పార్క్​ చేయబోగా అడ్డుగా బైక్​ కనిపించింది. దానిని కాస్త పక్కకు తీయమని బైక్​ యజమాని అయిన తమిళ వ్యక్తికి చెప్పాడు. దాంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన తమిళ వ్యక్తి నన్నే బైక్ తీయమంటావా? అంటూ అసభ్యకర పదజాలంతో దూషించాడు. దాంతో గొడవ పెద్దదైంది. దీంతో స్థానికంగా పెద్ద మనుషులుగా ఉన్నవారు ఇరువురికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

Also Read- Telangana Local Body Elections: స్థానిక సమరంపై జోరుగా బెట్టింగ్‌లు.. హైకోర్టు తీర్పు కోసం ఎదురు చూపులు

కర్రలతో దాడులు

అప్పటికే, విషయం తెలిసి ఇరువర్గాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సమాచారం తెలిసి అక్కడికి వచ్చిన పోలీసులు ఇరువర్గాల వారికి నచ్చజెప్పారు. పండుగ తర్వాత పిలిపించి మాట్లాడుతామని చెప్పారు. ఈ క్రమంలో శనివారం మరోసారి రెండు వర్గాలకు చెందిన వారు పంచాయతీ జరుగుతున్న చోటుకు వచ్చారు. తమిళ వ్యక్తి తరపున వచ్చిన వారిలో కొందరు కర్రలతో దాడులకు సైతం పాల్పడ్డారు. దాంతో మరోసారి అక్కడికి వచ్చిన పోలీసులు రెండు వర్గాల వారిని అక్కడి నుంచి తరిమేశారు. కాగా, చిన్న విషయమై తలెత్తిన ఈ వివాదం ముందు ముందు ఏ స్థాయికి వెళుతుందో అన్న భయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే మార్వాడీ గో బ్యాక్ ఆందోళనలో నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ప్రాంతీయ వాదం నెలకొన్ని, ఇటువంటి పరిస్థితులకు తావిస్తుందో అని అంతా భయపడుతున్నారు.

Also Read- Sama Ram Mohan Reddy: ‘హరీష్​ రావుకు అరుదైన వ్యాధి ఉంది’.. కాంగ్రెస్ నేత షాకింగ్ కామెంట్స్

సరికొత్త వివాదం

ఈ మధ్య ఇటువంటి దాడులు సర్వసాధారణంగా మారిపోయాయి. పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా, ఎవరూ పట్టించుకునే పరిస్థితులు లేవు. మరీ ముఖ్యంగా తెలంగాణలో ‘మార్వాడీ గో బ్యాక్’ అనే నినాదం తీవ్ర వివాదానికి దారి తీసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లోని కొన్ని గోడలపై, సోషల్ మీడియాలో ఈ నినాదాలు కనిపించాయి. ముఖ్యంగా, తెలంగాణ వ్యాప్తంగా వ్యాపారాల్లో ఆధిపత్యం చలాయిస్తున్న ఇతర రాష్ట్రాల వర్తకులను ఉద్దేశించి ఈ నినాదాలు ప్రచారమయ్యాయి. దీనిపై వివిధ వర్గాల నుంచి భిన్న స్పందనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా తమిళ తంబీల లొల్లి.. సరికొత్త వివాదానికి తెరలేపింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!