Sasivadane Team
ఎంటర్‌టైన్మెంట్

Sasivadane: ఇందులో ఎటువంటి అశ్లీలత ఉండదు.. ఇలాంటి క్లైమాక్స్ ఇప్పటి వరకు చూసుండరు

Sasivadane: రక్షిత్ అట్లూరి (Rakshit Atluri), కోమలి ప్రసాద్ (Komalee Prasad) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శశివదనే’ (Sasivadane). గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 10న విడుదలయ్యేందుకు ముస్తాబైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ శనివారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అహితేజ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం మేం ఎంతో కష్టపడ్డాం. ఆడియెన్స్‌కి మంచి అనుభూతిని ఇవ్వాలని కష్టాన్ని లెక్కచేయలేదు. మాకు మొదటి నుంచి మీడియా సపోర్ట్ ఇచ్చింది. ఈ మూవీ ఏ ఒక్కరినీ నిరాశపర్చదు. ఈ సినిమా విడుదల ఆలస్యమవడానికి కారణం నాకు అనుభవం లేకపోవడమే. కంటెంట్‌పై మేమంతా ఎంతో నమ్మకంగా ఉన్నాం. ఈ సినిమా పూర్తి కాకముందే అన్ని రైట్స్ అమ్ముడుపోయాయి. నన్ను నమ్మిన డిస్ట్రిబ్యూటర్లకు థ్యాంక్స్. ‘శశివదనే’లో ఉన్న క్లైమాక్స్‌ను నాకు తెలిసినంత వరకు.. తెలుగులో ప్రేక్షకులు ఇంత వరకు చూడలేదనే అనుకుంటున్నాను. నా ఈ ప్రయాణంలో సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలని తెలిపారు.

Also Read- Bigg Boss Elimination: బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేటైంది ఎవరో తెలుసా?

ఎటువంటి అశ్లీలత ఉండదు

హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ.. సరిగ్గా మూడేళ్ల క్రితం తేజ నాకు ఈ కథ చెప్పారు. దర్శకుడు సాయి చెప్పిన కథ మొదట్లో నాకు నచ్చలేదు. అసలు ఆయనేం చెబుతున్నాడో కూడా అర్థం కాలేదు. కథగా అయితే అర్థం కాలేదు కానీ, ఆయన చెప్పిన సన్నివేశాలు చాలా నచ్చాయి. ఆయన తీసిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చూశాను. ఇందులో ఆయన రాసుకున్నట్టుగా ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ ఇంత వరకు తెలుగులో ఎక్కడా రాలేదు. శ్రీమాన్ చేసిన పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. గోదావరి జిల్లాల్ని అద్భుతంగా చూపించిన సాయి కుమార్ పనితనం గురించి సినిమా విడుదల తర్వాత అందరూ చెప్పుకుంటారు. గౌరీ క్యాస్టూమ్స్, శర్వా మ్యూజిక్, అనుదీప్ ఆర్ఆర్.. ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పిస్తాయి. కోమలి అద్భుతమైన నటి. ప్రస్తుతం ఆమె పెద్ద హీరోల సినిమాలలో చేస్తుంది. ఈ సినిమాలో ఎటువంటి అశ్లీలతకు తావు లేకుండా నిజాయితీగా ఓ మంచి సినిమాను చేశాం. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రతి ప్రేక్షకుడు ఆనందంతో బయటకు వస్తారు. ఏ ఒక్కరినీ ఈ సినిమా నిరాశ పరచదని మాత్రం చెప్పగలను. అక్టోబర్ 10న మా సినిమాను చూసేందుకు థియేటర్స్‌కు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుందని, థియేటర్లో అందరినీ మా సినిమా కచ్చితంగా సర్ ప్రైజ్ చేస్తుందని అన్నారు హీరోయిన్ కోమలి ప్రసాద్.

Also Read- OG Movie: ‘ఓజీ’ మూవీ నేహా శెట్టి సాంగ్ వచ్చేసింది.. ఈ పాటను ఎలా మిస్ చేశారయ్యా?

సింగిల్ షాట్ సీన్ గురించి మాట్లాడుకుంటారు

డైరెక్టర్ సాయి మోహన్ మాట్లాడుతూ.. నేను సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్నది మా నాన్న కల, కోరిక. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన తేజ, గౌరీలకు థాంక్స్. రక్షిత్ ఓ పది రోజుల షూటింగ్ తర్వాత నన్ను చాలా గట్టిగా నమ్మారు. ఈ సినిమాను మీడియానే ముందుకు తీసుకెళ్తోంది. కెమెరామ్యాన్ సాయి కుమార్‌ నాకు మంచి విజువల్స్ ఇచ్చారు. నేను రాసుకున్న కథను ఒక అందమైన పెయింటింగ్‌లా మార్చాడు. శర్వా, అనుదీప్ నాకు మంచి మ్యూజిక్, ఆర్ఆర్ ఇచ్చారు. నేను ఎంత అందంగా రాసుకున్నానో.. అంతకు మించి అనేలా ఇందులో కోమలి నటించారు. కథ చెప్పిన వెంటనే శ్రీమాన్ ఓకే చేశారు. ఆయన చేసిన సింగిల్ షాట్ సీన్ గురించి సినిమా విడుదల తర్వాత అందరూ చెప్పుకుంటారు. గ్యారీ ఎడిటింగ్ అందరికీ నచ్చుతుంది. అక్టోబర్ 10న మా చిత్రం వస్తోంది. అందరూ ఈ సినిమాను చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?