Bigg Boss Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9)లో నాల్గవ వారం ఎలిమినేషన్‌కు సంబంధించి అప్పుడే ఊహాగానాలు, లీక్‌లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా అందుకున్న సమాచారం ప్రకారం, ఈ వారం హౌస్ నుండి ఎవరు బయటకు వచ్చారనేది క్లారిటీ వచ్చేసింది. ఈ వారం ఎలిమినేట్ అయ్యేందుకు నామినేట్ అయిన వారి లిస్ట్‌ను ఒకసారి పరిశీలిస్తే.. రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, సంజన, శ్రీజ దమ్ము, హరిత హరీష్, దివ్య నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు బయటకు వెళతారనేది ఆసక్తికరంగా మారింది. ఒక్క దివ్య మినహా.. మిగతా అందరూ ఫస్ట్ డే నుంచి హౌస్‌లో ఉన్నావారే. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా తర్వాత ఎలిమినేట్ అయ్యే హౌస్‌మేట్ ఎవరా? అని అంతా.. ఆతృతగా వేచి చూస్తున్న తరుణంలో.. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లుగా ఇప్పుడో షాకింగ్ నేమ్ వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- 80s Reunion Party: ‘80స్ రీ-యూనియన్ పార్టీ’కి ఒకే ఫ్లైట్‌లో చిరు, వెంకీ.. ఫొటో వైరల్!
అత్యల్పంగా ఓట్లు రావడంతో..
ఈ వారం ఇంటి నుంచి బయటకు వచ్చేస్తున్న కంటెస్టెంట్ ఎవరో కాదు.. కామనర్ హరిత హరీష్ (Haritha Harish) అని తెలుస్తోంది. అవును ఈ వారం ఆయన ఎలిమినేట్ అయినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంకా అధికారికంగా నాగార్జున (King Nagarjuna) ప్రకటించకపోయినప్పటికీ, ఓటింగ్ పర్సంటేజ్ హరిత హరీష్‌కు చాలా తక్కువ ఉండటంతో, ఆయనే ఈ వారం ఎలిమినేట్ అయ్యారని టాక్ నడుస్తుంది. ఈ వారం నామినేషన్లలో హరిత హరీష్‌తో పాటు మరికొందరు బలమైన కంటెస్టెంట్లు ఉన్నారు. అయితే, ఓటింగ్ సరళిని బట్టి చూస్తే, హరిత హరీష్‌కు పోల్ అయిన ఓట్లు అత్యల్పంగా ఉండటం వల్లే ఆయన ఎలిమినేట్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. హరిత హరీష్‌ను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు పంపే ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, దీనికి సంబంధించిన షూటింగ్ కూడా జరిగిపోయిందనేలా లీక్స్ తెలియజేస్తున్నాయి.
Also Read- Bigg Boss Telugu 9: బిగ్ బాస్ డే 27 ప్రోమో.. బిర్యానీ హీట్ మాములుగా లేదుగా!
ఎలిమినేషన్‌కు ప్రధాన కారణమిదేనా?
హరిత హరీష్ హౌస్‌లో తన ఆట తీరుతో అందరి నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు ఆయన టాస్క్‌లలో చురుగ్గా పాల్గొన్నా, మరికొన్ని సందర్భాల్లో కంటెస్టెంట్లతో జరిగిన గొడవలు, ఆయన తీసుకున్న స్టాండ్స్ ప్రతికూలంగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో నాలుగు వారాలు ఉన్నా, హరీష్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేకపోవడమే, ఆయన ఎలిమినేషన్‌కు ప్రధాన కారణమని అంతా భావిస్తున్నారు. హౌస్‌లో అందరూ ఒక జట్టు అయితే, ఆయనొక్కడే ఒక జట్టు అన్నట్లుగా షోని మార్చేశారు. ఇది ఇలాగే సాగితే.. మరో కౌశల్ మంద ఎపిసోడ్ అవుతుందని భావించి, ఆయనకు వీక్షకులు ఓటింగ్ ఇవ్వలేదనేలా కొంతమంది నెటిజన్స్ రియాక్ట్ అవుతుండటం విశేషం. అసలు హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యాడా? లేదా? అనేది మాత్రం ఇంకొన్ని గంటల్లో అధికారికంగా తెలిసిపోనుంది. ఈ వారం హరిత హరీష్ ఎలిమినేషన్ కనుక నిజమైతే, హౌస్‌లో మిగిలిన కంటెస్టెంట్లు మరింత అప్రమత్తం అయ్యే అవకాశం అయితే లేకపోలేదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
