Crime News (imagecredit:swetcha)
క్రైమ్

Crime News: కొడుకు చెడిపోవడానికి తల్లే కారణం అని.. భార్యను అతి కిరాతకంగా చంపిన భర్త

Crime News: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరులో గ్రామంలో దారుణం జరిగింది. పండుగ రోజునే ఘోర హత్య సంచలనం రేపింది. తల్లి గారాబం కారణంగానే తన పెద్ద కొడుకును చెడుదారులు పట్టేలా చేసిందన్న అక్కసుతో భర్త తన భార్యను గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపాడు. ఆ సంఘటనతో అక్కడి గ్రామస్తులంతా ఒక్క సారిగా షాక్‌కి గురయ్యారు. ఇక వివరాల్లోకి వెలితే..

పెద్ద కొడుకుపై తల్లి చూపిన అతి మమకారం..

మహబూబాబాద్ జిల్లా ఆలేరు గ్రామానికి చెందిన చీకటి నరేష్స్వప్న అనే ఇద్దరు దంపతులు కలరు. వీరికి ఇద్దరు కుమారులు కలరు. సుఖ:సంతోషాల జీవితం గడపాలి గానీ, తరచూ ఇరువురి మధ్య కలహాలతో బతుకు బారిన పడ్డారు. ఇంట్లోనే కిరాణం, చికెన్ షాపులు రెండు నడిపించుకుంటూ ఆర్థిక ఇబ్బందులు లేకుండా బాగానే జీవనం కొనసాగిస్తున్నారు. కానీ పెద్ద కొడుకుపై తల్లి చూపిన అతి మమకారం కారణంగా భర్త కంట్లో గింజలా కనిపించిందట, తల్లి గారాబం వల్ల కొడుకు దారి తప్పుతున్నాడని అనుమానంతో దంపతుల మధ్య తరచూ వాగ్వాదాలు జరిగేవి ఆట.దీంతో వివాదాలు పండుగ రోజున మరింత తీవ్రమయ్యాయి. ఆగ్రహంతో ఊగిపోయిన నరేష్ తన భార్య స్వప్నను ఇంట్లోనే కుటుంబ సభ్యుల కళ్ల ముందే గొడ్డలితో మెడపై నరికి చంపేశాడు.

Also Read: Jurel Army Salute: టెస్ట్ కెరీర్‌లో జురెల్ తొలి సెంచరీ.. సెల్యూట్ చేస్తూ ఎవరికి అంకితం ఇచ్చాడో తెలుసా?

వెలుగులోకి షాకింగ్ విషయాలు

పిల్లలు, బంధువులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా కనికరం చూపలేదు. భార్యను బలితీసుకుని నరేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయాలు.. తల్లి అతి గారాబమే పెద్ద కుమారుడి దారితప్పడానికి కారణమని, అదే భర్తకు అసహనంగా మారిందని పోలీసులు గుర్తించారు. మద్యం లేదా డబ్బుల సమస్యలు కాదు భార్య పెత్తనం, పిల్లలపై మమకారమే ఈ దారుణానికి కారణం అని నెల్లికుదురు సీఐ సత్యనారాయణ(CI Sathya Narayana) తెలిపారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించగా, కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కుటుంబాన్ని భుజాలపై మోస్తూ నడిపిస్తున్న భార్యను ఇంత కిరాతకంగా నరికి చంపాడ? వెంటనే నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలి అని మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Also Read: Sagar Singareni Movie: వారి జీవితాల కథ ఆధారంగా సాగర్ కొత్త సినిమా..

Just In

01

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు