Ganja Addiction: గంజాయి మత్తులో యువత నేరాల పాల్పడుతున్నారు. గంజాయి మత్తులో 18 నుంచి 25 వయసుగల యువత తూలుతున్నారు. కన్ను మిన్ను ఎరగకుండా మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. పిల్లలు మత్తుకు బానిసై పెడదారిన పట్టి అనేకమైన నేరాల్లో ఇరుక్కుని తమ జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో గంజాయి మత్తులో ఉన్న యువత నానమ్మ, తల్లిదండ్రులపై నిత్యం దాడులకు దిగుతున్న ఘటనలు కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి.
విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు
ఖమ్మం(Khammam), కొత్తగూడెం(Kothagudem), సూర్యాపేట(Surayapet), నల్లగొండ(Nalgonda), మహబూబాబాద్(Mahabubabad), ములుగు(Mulugu) జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలో నిత్యం గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. గతంలో బీటెక్, ఎంబీఏ(MBA), ఎంసీఏ(MCA), మెడికల్(Medical) కాలేజీల వద్ద జరిగిన గంజాయి విగ్రహాలు నేడు ప్రతి పట్టణంలోని పాఠశాలలు, కళాశాలల వద్ద కొనసాగుతున్నాయి, పోలీస్ నిఘా వ్యవస్థ పని చేస్తున్నప్పటికీ వారిని పక్కదారి పట్టించి మరి గంజాయి విక్రయాలు అక్రమార్కులు కొనసాగిస్తున్నారు.
Also Read: Mana Shankara Varaprasad Garu: ‘మీసాల పిల్ల’ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. ఎలా మెగాస్టార్ ఇలా?
తల్లితండ్రులారా తస్మాత్ జాగ్రత్త?
తల్లిదండ్రులు తమ పిల్లలను అనునిత్యం పట్టించుకోకుండా ఆజాగ్రత్తగా ఉంటే వారి భవిష్యత్తు అంతేనని జరుగుతున్న ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. మన పిల్లల్ని ఈ వయసులో యువతను తల్లిదండ్రులు సరైన దారిలో ఉంచకపోవడంతోనే యువత గంజాయి మత్తు బారిన పడుతున్నారు. వాళ్లు తగు నేరాలకు పాల్పడి వాళ్ళ జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. తల్లితండ్రులు ప్రతి ఒక్క పిల్లవాడిని ఒక కంట కనిపెడుతూ తగు సూచనలు, సలహాలు ఇవ్వవలసిందిగా, అలాగే చట్టరీత్యా నేరాలపై అవగాహన కల్పించవలసిందిగా, ప్రభుత్వంపై, పేరెంట్స్ పై ఎంతో ఉంది. ఈ గంజాయి ప్యాకెట్లు రూ.50 నుంచి రూ.100 వరకు లభించడం, సిగరెట్ల రూపంలో కూడా గంజాయి అమ్మటం వలన యువత బాగా చెడిపోతున్నారు.
జల్సాల కోసం పెడదారి పడుతున్న యువత
కొంతమంది గంజాయి విక్రయాలు చేస్తున్న వారితో యువత దోస్తీ కడుతూ.. గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్నారు. చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేయాల్సిన యువత జల్సాల కోసం పక్కదారి పడుతున్నారు. ఈ యువత రాష్ట్రంలో ఏదో ఒకచోట తగు నేరాలకు పాల్పడి కేసులు పాలై నిండు జీవితాన్ని ఆగం చేసుకుంటుంది. యువతలో విద్యార్థులే అధికంగా ఉండటం వలన గ్రామాలలో పట్టణాలలో నిర్మానుష ప్రదేశాలలో గంజాయి సేవించి మత్తులో తూలుతున్నారు.
బైకులపై ముగ్గురు ముగ్గురు యువకులు రైడ్ చేస్తూ రహదారులపై హంగామా సృష్టిస్తున్నారు. ఈ మత్తులో కుటుంబ సభ్యులతో గొడవలకు దిగి డబ్బు కావాలని బెదిరించి ఏమాత్రం వెనకాడకుండా నేరాలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా ఈ డబ్బుకి అలవాటు పడి దొంగతనాలకు కూడా వెనకాడటం లేదు. యువత గంజాయిని వివిధ రూపాలలో సేవిస్తూ, బహిరంగ ప్రదేశాలలో సిగరెట్ల రూపంలో పేపర్ రోల్ లో చుట్టి విక్రయించటం వలన యువత చెడిపోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. దీనిపై పోలీస్ వ్యవస్థ నిఘ ఎక్కువగా పెట్టి అలాగే స్వచ్ఛంద సంస్థల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Also Read: Maoist Surrender: మావోయిస్టులకు భారీ షాక్.. 103 మంది మావోయిస్టులు లొంగుబాటు
