Mario: కళ్యాణ్ జీ గోగణ (Kalyanji Gogana) ఈ దర్శకుడి పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ‘నాటకం’, ‘తీస్ మార్ ఖాన్’ వంటి డిఫరెంట్ చిత్రాలతో దర్శకుడిగా కళ్యాణ్ జీ గోగణ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. దసరా సందర్భంగా ఆయన తదుపరి చిత్రం ‘మారియో’ నుంచి ఓ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. ‘మారియో’ నుంచి అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌పై ‘ఎ టర్బో-చార్జ్డ్ ర్యాంప్ రైడ్’ అనే ట్యాగ్‌లైన్‌తో అందరినీ ఆకర్షిస్తోంది. యాక్షన్-ప్యాక్డ్, స్టైలిష్, రొమాంటిక్ వైబ్‌తో ఈ పోస్టర్ విడుదలైన వెంటనే ట్రెండ్‌లోకి వచ్చేసింది. ఈ ఫస్ట్ లుక్‌లో హీరో అనిరుధ్, హెబ్బా పటేల్ పెట్టిన పోజు, వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసిన వారంతా.. అబ్బో అరిపించేశారుగా.. అని అంటున్నారంటే ఏ రేంజ్‌లో ఈ ఫస్ట్ లుక్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read- Apple Watch: సముద్ర గర్భంలో యువకుడు.. ఇంతలో ఊహించని సమస్య.. హీరోలా కాపాడిన యాపిల్ వాచ్!
కుర్రాళ్ల మతులు పోగోట్టేలా..
ఈ ఫస్ట్ లుక్‌ను తీక్షణంగా గమనిస్తే.. హీరో అనిరుధ్ (Anirudh) రైఫిల్ పట్టుకుని ఉన్న తీరు, ఇంటెన్స్ లుక్ చూస్తుంటే.. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటుందనేది అర్థమవుతోంది. అలాగే హెబ్బా పటేల్ (Hebah Patel) ఎరుపు రంగు దుస్తుల్లో డైనమిక్‌గా నిలబడి కుర్రాళ్ల మతులు పోగోడుతోంది. క్లాసిక్ కారు, చీకటి, వర్షం ఇలా అన్నింటినీ చూస్తుంటే థ్రిల్లర్ థీమ్‌ను తెలియజేస్తున్నాయి. సీట్ ఎడ్జ్ థ్రిల్ కలిగించేలా అన్ని రకాల కమర్షియల్ అంశాలను జోడించి, అందుకు తగినంత ఎంటర్‌టైన్‌మెంట్ మిళితం చేసి.. ప్రేక్షకులకు అద్భుతమైన ట్రీట్ ఇస్తామని అంటున్నారు మేకర్స్. దసరా శుభాకాంక్షలు తెలుపుతూ విడుదలైన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Also Read- Akshay Kumar: అలాంటి ఫొటోలను పంపుతారా? తన కుమార్తెకు ఎదురైన షాకింగ్ ఘటనను తెలిపిన అక్షయ్!
సినిమాటిక్ అనుభవాన్ని ఇచ్చేలా..
సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మాణం జరుపుకుంటోన్న ఈ చిత్రానికి రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గత చిత్రాలలో కామెడీ, థ్రిల్‌ను విజయవంతంగా మిళితం చేసిన దర్శకుడు కళ్యాణ్‌జీ గోగణ.. ఈసారి మాత్రం ప్రేక్షకులకు సినిమాటిక్ అనుభవాన్ని ఇవ్వబోతున్నారనేది ఈ ఫస్ట్ లుక్ క్లారిటీ ఇచ్చేస్తుంది. సాయి కార్తీక్, రాకేందు మౌళి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. పాటలు, మాటలు రాకేందు మౌళి.. MN రెడ్డి సినిమాటోగ్రఫీ.. మణికాంత్, మదీ మన్నెపల్లి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా వేగంగా పూర్తి చేసి, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని మేకర్స్ తెలిపారు. హీరోయిన్ హెబ్బా పటేల్‌కు కూడా ఈ సినిమా ఎంతో ముఖ్యమైనదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
