MLC Kavitha (imagecredit:swetcha)
తెలంగాణ

MLC Kavitha: పండగంటే పది మందితో కలిసి ఆనందంగా జరుపుకోవడం: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: కవి, రచయిత ప్రొఫెసర్ ఎన్. గోపి(N Gopi), ప్రముఖ కవి కె. శివారెడ్డి(Shivareddy) ని శుక్రవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) పరామర్శించారు. ఎన్. గోపి సతీమణి అరుణ, శివారెడ్డి కుమారుడు, ప్రముఖ చిత్రకారుడు శంబుప్రసాద్ ఇటీవల మరణించారు. గడ్డి అన్నారంలోని శివారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను కవిత ఓదార్చారు. శివారెడ్డి కి ధైర్యం చెప్పారు. రామాంతపూర్ లోని ఎన్. గోపి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. కవిత వెంట తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ముఖ్య నాయకులు కోల శ్రీనివాస్, మహేందర్, గణపురం దేవేందర్, శివారెడ్డి, రాము యాదవ్ తదితరులు ఉన్నారు

ఆనందం పంచుకోవటమే పండుగంటే..

పది మందితో ఆనందం పంచుకోవటమే పండుగంటే అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) శుక్రవారం ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ – బలయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దత్తాత్రేయను ఘనంగా కవిత సత్కరించిమాట్లాడారు. గత 20 ఏళ్లుగా దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, రాజకీయాలకు, మతాలకు, కులాలకు అతీతంగా చేపడుతున్నారన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆనందాన్నిపంచుకునే వేదికే అలయ్, బలయ్ కార్యక్రమం అని స్పష్టం చేశారు. దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కూడా వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఈ కార్యక్రమం చేయటం ఆనందంగా ఉందన్నారు.

Also Read: CPI: సీపీఐ వందేళ్ల ముగింపు ఉత్సవాలు ఆ జిల్లాలోనే?: పల్లా వెంకటరెడ్డి

ఎవరు ఆయన వద్దకు వెళ్లినా..

భవిష్యత్ లోనూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్ గా నడిపించాన్నారు. దత్తన్న అంటే పదిమందిని కలుపుకొని పోయే తెలంగాణ వ్యక్తిత్వం కలిగిన వారిగానే గుర్తుకు వస్తారన్నారు. రాజకీయాల్లో ఎదుగుతున్న క్రమంలో చాలా మంది నాకు దత్తన్న గురించి చెప్పేవాళ్లు అని, ఏదైనా పనికోసం ఎవరు ఆయన వద్దకు వెళ్లిన సరే వాళ్ల సమస్య తీర్చే వాళ్లని చెప్పే వారన్నారు. వారికి ఉత్తరం ఇచ్చి ఆ సమస్య తీరే వరకు ఫాలో అప్ చేసే వారని మాకు చెప్పేవాళ్లు.. ఆయన మాదిరిగా రాజకీయాల్లో ఉండాలని అనేవాళ్లు.. అలాంటి దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. 20 ఏళ్లుగా కొనసాగుతున్న అలయ్ బలయ్ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నానన్నారు.

Also Read: Ramakrishna controversy: కాంట్రవర్సీ తర్వాత అకౌంట్ డిలేట్ చేసిన రాహుల్ రామకృష్ణ.. ఎందుకంటే?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!