Ramakrishna controversy: కాంట్రవర్సీ కామెట్లతో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టాలీవుడ్ ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ నాయకులను, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)లను ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇప్పడు ఇలా ట్వీట్లు చేసిన అనంతరం తన సోషల్ మీడియా అకౌంట్ డిలేట్ చేయడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారుతుంది. ఇది అసలు ఆయనే డిలేట్ చేశారా? లేదా ఎవరైనా బెదిరించి డిలేట్ చేయించారా అన్నది తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టినప్పటి నుంచీ ఆయన ఎవరికీ అందుబాటులో లేరు. దీంతో విభిన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అసలు ఏం జరిగిందో తెలియాల్సి ఉంది. అకౌంట్ డిలేట్ చేయడంపై రాజకీయ వత్తడులే కారణం అంటున్నారు నెటిజన్లు.
Read also-Sandeep Reddy Vanga: ‘కాంతార చాప్టర్ 1’పై ‘యానిమల్’ దర్శకుడు షాకింగ్ కామెంట్స్..
టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ రాజకీయ, వ్యక్తిగత నిరాశల కలబోతగా చేసిన ట్వీట్లు తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. అసలు రాహుల్ రామకృష్ణకు ఏమైంది? అంటూ నెటిజన్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ ట్వీట్స్‌కు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ట్వీట్స్ చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితిపై డౌట్స్ వస్తున్నాయనేలా వారు రియాక్ట్ అవుతుండటం విశేషం. ఇప్పుడే కాదు.. గతంలో కూడా ఆయన ఇలాంటి ట్వీట్స్‌తోనే వార్తలలో నిలిచారు. ఇక సినిమాలు మానేసి వెళ్లిపోతా.. నా వల్ల కాదంటూ అప్పట్లో చేసిన కొన్ని సంచలన ట్వీట్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. అది కేవలం సినిమాల వరకే.. కానీ ఇప్పుడు రాజకీయాలకు ముడిపెడుతూ ఆయన చేసిన ట్వీట్స్ నిజంగానే దుమారాన్ని రేపుతున్నాయి.
Read also-Nani Sujeeth: ‘బ్లడీ రోమియో’.. ‘ఓజీ’ దర్శకుడి నెక్ట్స్ సినిమాకు క్లాప్ పడింది
ట్వీట్ లో..
రాహుల్ రామకృష్ణ ఓ ట్వీట్‌లో తన వ్యక్తిగత నిరాశను తెలియజేస్తూ.. ‘‘నేను విసిగిపోయా. నన్ను చంపేయండి’’ అని పేర్కొనడం తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. మరొక ట్వీట్‌లో ఆయన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై స్పందించారు. ‘మనం భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం’ అంటూనే, ‘డంబుల్ డోర్ కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నా’ అని మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు. ఇంకా ఇదే ట్వీట్‌లో ‘నేను బాగా విసిగిపోయాను.. నన్ను చంపేయండి’ అని అనడం చూస్తుంటే.. తను ఆశించినట్లుగా ఏమీ జరగడం లేదని, పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఈ ట్వీట్ తెలియజేస్తుంది. దీని కంటే ముందు అక్టోబర్ 2 గాంధీ జయంతి కాగా, ఆయనను ఉద్దేశిస్తూ కూడా ఓ ట్వీట్ చేశారు. అందులో ‘మళ్ళీ చెబుతున్నా, గాంధీ సాధువు కాదు.. అలానే మహాత్ముడు కాదు’ అని పోస్ట్ చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నెలకొన్న సమస్యలపై రాహుల్ రామకృష్ణ మరో ట్వీట్‌లో.. ‘‘హైదరాబాద్ మునిగిపోయింది. హామీలన్నీ విఫలమయ్యాయి. వీటిని చక్కబెట్టేందుకు ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు కేసీఆర్’’ అంటూ ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ చేసిన పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

