Sandeep Reddy Vanga: దసరా సందర్భంగా విడుదలైన ‘కాంతార చాప్టర్ 1’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి టాక్ రాబట్టుకొంది. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతున్నందుకు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటికే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. అయితే తెలుగులో మరో బిగ్ డైరెక్టర్ కాంతార చాప్టర్ 1 సినిమాను పొగడ్తలతో ముంచెత్తారు. ఆయనే ‘యానిమల్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. కాంతార చాప్టర్ 1 గురించి సందీప్ రెడ్డి ఏం అన్నారంటే.. ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ఆవిష్కరించబడింది. ‘కంతార చాప్టర్ 1’ – ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక సినిమాటిక్ తుఫాను. రిషబ్ షెట్టి డైరెక్షన్‌లో ఆయనే ప్రధాన పాత్రలో రూపొందించబడిన ఈ చిత్రం, భారతీయ సినిమా ఎన్నడూ చూడని ఒక అద్భుతాన్ని అందిస్తుంది. 2025లో విడుదలైన ఈ కన్నడ చిత్రం, 2022లో విడుదలైన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ఉంది.
Read also-Kiran Abbavaram: పెళ్లికి.. రైట్ ఏజ్, రైట్ టైమ్ ఎప్పుడని అడిగితే.. కిరణ్ ఏం చెప్పారో తెలుసా?
సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో చిత్ర యూనిట్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు, విమర్శకులు మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడంతో ‘కాంతార: చాప్టర్ 1’ కలెక్షన్స్ కూడా మరింత పెరుగుతున్నాయి.తాజాగా తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘కాంతార చాప్టర్ 1’ సినిమాకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చారు. ‘‘రీ సౌండింగ్ సక్సెస్ అందుకున్న కాంతార: చాప్టర్ 1 యూనిట్‌కు నా అభినందనలు. నటుడిగా, దర్శకుడిగా సోదరుడు రిషబ్ శెట్టి ఊహకందని అద్భుతాన్ని సృష్టించాడు. ఆయనపై ఉన్న నమ్మకంతో, ఆయన విజన్‌ను అర్థం చేసుకుని, ఇంత గొప్ప ప్రాజెక్ట్ నిర్మాణానికి కారణమైన హోంబల్ ఫిల్మ్స్ కి, చిత్రబృందానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని తారక్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ అభిప్రాయాన్ని అందరూ ఏకీ భవిస్తూ.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు అంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Read also-Elon Musk: సంపద విషయంలో ఎలాన్ మస్క్ అరుదైన ఘనత.. ఈ భూమ్మీద తొలి వ్యక్తి ఆయనే
ఈ ప్రీక్వెల్ సినిమా అంచనాలకు మించి మొదటి రోజు దాదాపు రూ.65 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. భారతదేశంలో మొత్తం రూ.60 కోట్లకు పైగా సంపాదించడం ద్వారా, ఇది 2025లో టాప్ ఓపెనర్స్‌లో ఒకటిగా నిలిచింది. హిందీలో రూ.19-21 కోట్లు, కన్నడలో రూ.18 కోట్లు, తెలుగులో రూ.12.5 కోట్లు, తమిళ్‌లో రూ.5.25 కోట్లు, మలయాళంలో రూ.4.75 కోట్లు కలెక్షన్లు సాధించింది. ఈ సంఖ్యలు హోంబాలే ఫిల్మ్స్ బ్యాకింగ్‌తో మల్టీ-లాంగ్వేజ్ రిలీజ్‌కు బలమైన స్టార్ట్‌ను తెలియజేస్తున్నాయి. తెలుగు మార్కెట్ ప్రత్యేకంగా చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆకట్టుకున్న రెస్పాన్స్ అద్భుతం. మొదటి రోజు తెలుగు వెర్షన్ రూ.12.5 కోట్లు సాధించడం ద్వారా, మొత్తం కలెక్షన్‌లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో మల్టిప్లెక్స్‌లు దాదాపు ఫుల్ అయ్యాయి. ఆక్యుపెన్సీ రేట్ 75.34%కి చేరడం ద్వారా, తెలుగు ప్రేక్షకులు రిషబ్ శెట్టి కథా, కల్చరల్ ఎలిమెంట్స్‌కు ఆకర్షితులయ్యారు.
KANTARA Chapter 1 is a true MASTERPIECE 🙏
INDIAN cinema has never seen anything like this before.
It's a cinematic thunderstorm, raw, divine, and unshakable.
Rishab shetty delivers a true one-man show, crafted and carried single-handedly 🙏@shetty_rishab
Special mention to…— Sandeep Reddy Vanga (@imvangasandeep) October 2, 2025
