Kiran Abbavaram: అందరికీ కాకపోయినా, కొందరికైనా ఓ డౌట్ ఉంటుంది. అసలు పెళ్లి చేసుకోవడానికి కరెక్ట్ ఏజ్, కరెక్ట్ టైమ్ ఏంటి? అని. మాములుగా అయితే పెద్దవాళ్లు వీడు వయసుకు వచ్చాడు.. ఇక పెళ్లి చేసేయాలని అంటుంటారు. పెళ్లి చేస్తే వాడి బతుకు వాడు బతుకుతాడని.. ఏదో ఒక అమ్మాయిని చూసి లగ్గం పెట్టేస్తారు. ఆ తర్వాత వాళ్లు హ్యాపీగా ఉన్నారా? లేరా? అనేది.. ఆ పెళ్లి చేసుకున్న ఇద్దరి మనసులను బట్టి ఉంటుంది. కొందరు కలకాలం కలిసి ఉంటారు. కొందరు మధ్యలోనే విడిపోతారు. ఎందుకు కలిసి ఉన్నారో, ఎందుకు విడిపోయారో అనేది వారి వ్యక్తిగత విషయం. అయితే అసలు పెళ్లికి కరెక్ట్ ఏజ్, టైమ్ ఏంటి? అని యంగ్ హీరో కిరణ్ అబ్బవరాన్ని (Kiran Abbavaram) ఓ యూట్యూబర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆయన చాలా చక్కగా సమాధానమిచ్చారు. ఆ విషయంలోకి వస్తే..
Also Read- Jr NTR: ఊహకందని అద్భుతం.. ‘కాంతార: చాప్టర్ 1’ రెస్పాన్స్‌పై తారక్ ఆసక్తికర పోస్ట్
అలా అనిపిస్తే పెళ్లి చేసుకోవడమే..
మీ పాయింట్ ఆఫ్ వ్యూలో.. రైట్ ఏజ్ ఆర్ రైట్ టైమ్ ఫర్ మ్యారేజ్ అంటే ఏం చెబుతారు? అనే ప్రశ్న కిరణ్ అబ్బవరానికి ఎదురైంది. ఈ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘‘మ్యారేజ్‌కి రైట్ టైమ్, రైట్ ఏజ్ అనేది ఏమీ ఉండదు. నీకు నచ్చిన అమ్మాయి, ఈ అమ్మాయితో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను అని అనిపించిందా.. వెంటనే పెళ్లి చేసేసుకో. కచ్చితంగా నీకు రైట్ అమ్మాయి అనిపించినప్పుడు.. నువ్వు ఎంత లో ఫేజ్‌లో ఉన్నా.. నీకు సపోర్ట్ చేస్తుంది. ఒక 5 సంవత్సరాలు కష్టపడి ఇద్దరూ ట్రావెల్ చేసినా గానీ, 5 సంవత్సరాల తర్వాత క్లిక్ అయితే.. ఆ సంతోషాన్ని ఇద్దరూ కలిసి పంచుకుంటారు. నా పాయింట్ ఏంటంటే.. డబ్బులు బాగా సంపాదించావ్. నీకు నచ్చిన అమ్మాయి నీతో లేదు.. అప్పుడేంటి నీ లైఫ్? రోజంతా గడపాల్సింది ఆ అమ్మాయితోనే కదా. నువ్వు బయట ఎన్ని పంచాయితీలు చేసుకోని వచ్చినా, ఇంట్లో ఉండాల్సింది తనతోనేగా. నచ్చనప్పుడు నీకు ఎన్ని కోట్లు ఉంటే ఏంటి? ఎన్ని సోఫాలు ఉంటే ఏంటి? ఇళ్లు ఎంత పెద్దది ఉంటే ఏంటి?’’ అని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.
Also Read- Mana Shankara Varaprasad Garu: ‘మీసాల పిల్ల’ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. ఎలా మెగాస్టార్ ఇలా?
డబ్బున్న కుర్రాడిగా
కిరణ్ అబ్బవరం సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ‘కె-ర్యాంప్’ (K Ramp Movie) అనే సినిమాలో నటిస్తున్నారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌లపై రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా, శివ బొమ్మాకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ప్రస్తుత ఈ సినిమా ప్రమోషన్స్‌ను కిరణ్ అబ్బవరం యమా జోరుగా నిర్వహిస్తున్నారు. కిరణ్ సరసన ఇందులో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించారు. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా వస్తున్న ఈ సినిమాలో డబ్బున్న కుర్రాడిగా కిరణ్ అబ్బవరం కనిపించనున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు