Chaitanya Rao: ఇటీవల వచ్చిన ‘ఘాటి’ (Ghaati) సినిమాలో పవర్ ఫుల్ విలన్‌గా కనిపించిన చైతన్య రావు (Chaitanya Rao) హీరోగా.. ‘ఓనమాలు’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ సెన్సిబుల్ స్టోరీలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక పంథాను ఏర్పరచుకున్న క్రాంతి మాధవ్ (Kranthi Madhav) దర్శకత్వంలో ఇప్పుడో చిత్రం రూపుదిద్దుకోనుంది. శ్రేయాస్ చిత్ర, పూర్ణా నాయుడు ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రొడక్షన్ నెంబర్ .5గా పూర్ణా నాయుడు, శ్రీకాంత్. వి నిర్మించనున్న ఈ సినిమాను శుక్రవారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభించారు. చైతన్య రావు మదాడి, ఐరా, సాఖీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా కోసం దర్శకుడు క్రాంతి మాధవ్ మరో యూత్ ఫుల్ కథను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. గ్యాప్ తర్వాత క్రాంతి మాధవ్ మరో సరికొత్త ప్రేమ కథతో అందరినీ మెప్పించేందుకు వస్తున్నారు. దసరా సందర్భంగా ఈ మూవీని శుక్రవారం (అక్టోబర్ 3) పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించగా (Kranthi Madhav New Movie Opening).. ముహూర్తపు సన్నివేశానికి సంచలన దర్శకుడు దేవా కట్టా (Deva Katta) క్లాప్ కొట్టగా, కె ఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాతలు పూర్ణ నాయుడు, శ్రీకాంత్ స్క్రిప్ట్ అందజేయగా.. ముహూర్తపు సన్నివేశానికి వర ముళ్ళపూడి గౌరవ దర్శకత్వం వహించారు.
Also Read- Akshay Kumar: అలాంటి ఫొటోలను పంపుతారా? తన కుమార్తెకు ఎదురైన షాకింగ్ ఘటనను తెలిపిన అక్షయ్!
బాధల్లో ఉన్నప్పుడు చేస్తా
చిత్ర ప్రారంభోత్సవం అనంతరం దర్శకుడు క్రాంతి మాధవ్ మాట్లాడుతూ.. ఇది నాకు ఐదో చిత్రం. చైతన్య రావుకు రెండో సినిమా. పూర్ణా నాయుడు, శ్రీకాంత్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఐరా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. సాఖీ బెంగాలీలో సీరియల్స్ చేశారు. ఈ మూవీతో ఆమె కూడా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. చైతన్య, పూర్ణలతో నాది ఎన్నో ఏళ్ల బంధం. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ తర్వాత పూర్ణతో ఓ మూవీని చేయాలి. ఆయన నువ్వు హిట్స్‌లో ఉన్నప్పుడు చేయను.. బాధల్లో ఉన్నప్పుడు చేస్తానని అన్నారు. అలా నా గత చిత్రం ఫ్లాప్ అయినప్పుడు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ టైమ్‌లోనే పూర్ణ వచ్చి సినిమా చేద్దామని అన్నారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. అందమైన లొకేషన్లలో భారీగా ఈ మూవీని చిత్రీకరిస్తామని తెలిపారు.

Also Read- Bomb Threat: మీ ఇంటిలో బాంబు పెట్టాం.. త్రిషతో పాటు ప్రముఖులకు చెన్నైలో బాంబు బెదిరింపుల కలకలం!
ఇంత కంటే ఎక్కువగా ఏం కోరుకోను
హీరో చైతన్య రావు మాట్లాడుతూ.. క్రాంతి అన్నతో నాది మూడేళ్ల బంధం. ఆయనతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాను. 2026లోనే ఆయనతో చేస్తున్న రెండు సినిమాలు విడుదలవుతాయి. నాకు ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చాలా ఇష్టమైన సినిమా. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో వరుసగా రెండు సినిమాలు చేస్తుండటం ఆనందంగా ఉంది. ఇంత కంటే ఎక్కువగా నేనా దేవుడ్ని ఏదీ కోరుకోను. ‘మయసభ’, ‘ఘాటీ’ తర్వాత ఇంత మంచి సినిమాను చేస్తుండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఓ సినిమా ఓకే చేశాను అంటే.. అందులో ఏదో ఒకటి కొత్తగా ఉంటుందనుకునే ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఇది న్యూ ఏజ్ లవ్ స్టోరీ. క్రాంతి అన్న చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. టాలీవుడ్‌కు వస్తున్న ఐరా, సాఖీలకు ఆల్ ది బెస్ట్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలని చెప్పారు. నిర్మాత పూర్ణ నాయుడు మాట్లాడుతూ.. క్రాంతిని నేను డైరెక్టర్‌గా పరిచయం చేయాలని అనుకున్నా. కానీ ఇన్నాళ్లకు మా ఇద్దరికీ కలిసి చేసే అవకాశం కుదిరింది. క్రాంతి కథలంటే నాకు చాలా ఇష్టం. శ్రీకాంత్ నా ప్రతీ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగానే ఉంటారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాల్ని తెలియజేస్తామన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
