Peddi Poster: బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే తాజాగా విడుదలైన ఓ పోస్టర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ను కంగారు పుట్టిస్తుంది. ఇంతకూ ఆ పోస్టర్ లో అంతగా భయపడాల్నిన విషయం ఏం ఉంది అని అనుకుంటున్నారా? అది ఏంటంటే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ రామ్ చరణ్ కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అందులో ట్రైన్ సీన్ అప్పట్లో బాగా ట్రోల్ అయింది. తర్వాత వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాలోకూడా రైలు పట్టాలపై చరణ్ ఉండే షాట్ ఒకటి బాగా వైరల్ అయింది. తాజాగా రామ్ చరణ్ పెద్ది సినిమాలో రైలు పట్టాలను దాటుతున్నట్టుగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు నిర్మాతలు. ఇందులో కూడా రైలు పట్టాలు షాట్ ఉండటంతో గత రెండు సినిమాల్లాగే ఈ సినిమా కూడా నిరాశపరుస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుంతం ఈ విషయం సోషల్ మీడిమాలో హాట్ టాపిక్ గా మారింది.
Read also-Local Body Elections: బండి వర్సెస్ ఈటల.. మళ్లీ భగ్గుమన్న విభేదాలు.. బీజేపీ తర్జన భర్జన
రామ్ చరణ్ అభిమానులకు ‘పెద్ది’ సినిమా మరో బ్లాక్‌బస్టర్ కానుకగా రానుంది. 2026లో విడుదల కానున్న ఈ చిత్రం, స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ‘ఉప్పేన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఈ సినిమాను రాసి, డైరెక్ట్ చేస్తున్నారు. వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూసర్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రం, పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ గ్రామీణ నేసధ్యంలో పెరిగిన క్రీడాకారుడిగా కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దివ్యేందు షర్మ (మిర్జాపూర్ ఫేమ్) కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ప్రాచార చిత్రాలు రామ్ చరణ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ సినిమా మార్చ 27, 2026న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Read also-Thaman promise: ‘ఓజీ’ విషయంలో మాట తప్పిన థమన్.. పాపం కదా బాసూ..
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పెద్ది’ మూవీ ఫస్ట్ సింగిల్ త్వరలో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి రామ్ చరణ్ పాట కంపోజిషన్ పూర్తియింది. లిరికల్ చేయడానికి వర్క్ జరుగుతుంది, అంటూ చెప్పుకొచ్చారు. ఇది తెలిసిన ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటుంన్నారు. మొదటి సింగిల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘పెద్ది’ కోసం ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రహ్మాన్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌ని కంపోజ్ చేసినట్లుగా ఇప్పటికే బుచ్చిబాబు సానా ప్రకటించారు. ఆడియన్స్, ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే సాంగ్స్‌ని ఏఆర్ రహ్మాన్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే రాబోయే ఫస్ట్ సింగిల్ ‘పెద్ది’ పాత్రకు సంబంధించిన టైటిల్ సాంగ్ అని రామ్ చరణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నారు. జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైసూర్లో జానీ మాస్టర్ ఒక భారీ సాంగ్‌ను కొరియోగ్రఫీ చేశారు. సుమారు 1000 మందికి పైగా డాన్సర్లతో ఈ సాంగ్ షూట్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ సినిమాలో అదిరిపోతుందని చిత్ర బృందం అంటున్నారు.
