Thaman promise: గత ఏడాది జరిగిన తెలుగు ఇండియన్ ఐడాల్ సీజన్ 3 స్టేజ్ మీద జరిగిన ఒక అద్భుతమైన క్షణం అప్పుడు సినిమా ప్రపంచాన్ని కదిలించింది. ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ థమన్, ఈ షోకి ఒక న్యాయ నర్ణేతగా ఉంటూ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రతిభావంతురాలైన జానపద గాయకురాలు లక్ష్మికి ఒక మాట ఇచ్చారు. ఆమెను పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘దె కాల్ హిమ్ ఓజీ'(OG) చిత్రంలో ఒక పాట పాడేందుకు అవకాశాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. అప్పుడు ఇలా చేసినందుకు థమన్ పై టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం థమన్ ను ప్రశంసలతో ముంచెత్తంది. అలా మాట ఇవ్వడం థమన్ కు మాత్రమే సాధ్యం అంటూ సినిమా పెద్దలు తెగ పొగిడారు. అప్పుడు జరిగిన సంఘటనతో థమన్ ఒక్క సారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ప్రస్తుతం ‘ఓజీ’ విడుదలై రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. అయితే సినిమాలో ఎక్కడా జానపదం ఆనవాళ్లు లేకపోండంపై నెటిజన్స్ థమన్ వైపే చూస్తున్నారు. అప్పుడు జానపద గాయకురాలు లక్ష్మికి ఇచ్చిన మాట ఉత్తిదేనా అంటూ కామెంట్ చేస్తున్నారు. మట్టిలో పుట్టిన పాటకు విలువేది అంటూ సంగీత అభిమానలు థమన్ ను ప్రశ్నిస్తున్నారు. దీనిపై థమన్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూడాలి మరి.
Read also-Putin on PM Modi: మోదీతో పెట్టుకోవద్దు.. భారత్ ఎప్పటికీ తలవంచదు.. ట్రంప్‌కు పుతిన్ వార్నింగ్
గాయిని లక్ష్మి, కడప జిల్లా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ ఫోక్ గాయకురాలు. తెలుగు ఇండియన్ ఐడాల్ సీజన్ 3లో తన అద్భుతమైన ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకుంది. ఆ సీజన్‌లో ఆమె మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ జడ్జీలను, ప్రేక్షకులను అలరించింది. ఒకా నొక సందర్భలో థమన్ ఆమె పాటకు మగ్ధుడై స్టేజ్ మీదే ఆమెకు పవన్ కళ్యాణ్ ‘ఓజీ’లో ఒక పాట పాడేందులకు అవకాశం ఇచ్చేశాడు. ఆ పాటకు సంబంధించి సింగర్ లక్ష్మికి కొంత అడ్వీన్స్ కూడా ఇచ్చాడు. అనంతరం ఇలా అన్నారు. “లక్ష్మి ప్రతిభకు ఈ అవకాశం ఖచ్చితంగా సరిపోతుంది. ఆమె గొంతు ‘ఓజీ’ చిత్రానికి ప్రత్యేక రంగు తీసుకొస్తుంది” అని థమన్ అన్నారు. ఆ షోలో లక్ష్మి పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి ట్రండింగ్ అవుతోంది.
Read also-Sandeep Reddy Vanga: ‘కాంతార చాప్టర్ 1’పై ‘యానిమల్’ దర్శకుడు షాకింగ్ కామెంట్స్..
పవన్ కల్యాణ్ ‘ఓజీ’ (They Call Him OG) సెప్టెంబర్ 25న విడుదలై, తెలుగు సినిమా పరిశ్రమలో మొదటి రోజు భారీ విజయాన్ని సాధించింది. సుజీత్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా, ఎమ్రాన్ హాష్మీ విలన్ రోల్‌లో కనిపించారు. రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించిన ఈ సినిమా, పవన్ కల్యాణ్ కెరీర్‌లో అత్యంత వేగవంతమైన చిత్రల్లో మొదటిగా ఉంది. ‘ఓజీ’ మొదటి రోజు భారతదేశంలో నెట్‌గా రూ.84.75 కోట్లు సంపాదించగా, ప్రపంచవ్యాప్తంగా గ్రాస్‌గా రూ.154 కోట్లకు చేరింది. ఇది 2025లో తెలుగు సినిమాల్లో అత్యంత భారీ ఓపెనింగ్‌గా నిలిచింది. ఈ చిత్రం పవన్ కల్యాణ్ సినిమాల్లో అత్యంత వేగవంతమైన 100 కోట్ల మైలురాయిని సాధించింది. ప్రస్తుతం రూ.200 కోట్లు దాటి రూ.300 కొట్ల మార్క్ దిశగా ఈ సినిమా వసూళ్లు సాగుతున్నాయి.
#TheyCallHimOG UPDATE
THAMAN announced intro Janapadha Song with these Folk Band .. 🪘🪗🥁
Thaman is Cooking something crazy for #OG 💥💥🔥@PawanKalyan @MusicThaman pic.twitter.com/nJm9dnnfQE
— Mandy (@kotha_kurrodu) July 20, 2024
