Bad Boy Karthik: కాస్త గ్యాప్ తర్వాత హీరో నాగశౌర్య (Naga Shaurya) చేస్తున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ (Bad Boy Karthik). రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో నాగశౌర్య సరసన విధి హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య పాత్ర ఇంటెన్స్ నేచర్‌ని పరిచయం చేసిన ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. అలాగే, ఫస్ట్ సింగిల్ ‘నా మావ పిల్లనిత్తానన్నాడే’ సాంగ్ కూడా మంచి అద్భుతమైన రెస్పాన్స్ రాబట్టుకుంది. ఇక విజయ దశమిని పురస్కరించుకుని మేకర్స ఈ సినిమా నుంచి ‘అమెరికా నుండి వచ్చాను’ అనే పాటని (America Nundi Vacchaanu Lyrical Video) రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ పాట విషయానికి వస్తే..
Also Read- Mana Shankara Varaprasad Garu: ‘మీసాల పిల్ల’ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. ఎలా మెగాస్టార్ ఇలా?
‘ఆరెంజ్’ తర్వాత ఆ రేంజ్ ఆల్బమ్
‘ఆరెంజ్’ సినిమా ఆల్బమ్‌తో ట్రెండ్ క్రియేట్ చేసిన హారిస్ జయరాజ్ (Harris Jayraj), చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఓ తెలుగు సినిమాకు పని చేస్తున్నారు. ‘అమెరికా నుండి వచ్చాను’ అంటూ సాగే ఈ సాంగ్‌ని ఫుట్ ట్యాపింగ్ నెంబర్‌గా ఆయన కంపోజ్ చేశారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ రాసిన లిరిక్స్ మాస్‌ని ఆకట్టుకోవడంతో పాటు చాలా డెప్త్ మీనింగ్‌తో వున్నాయి. చందన బాల కళ్యాణ్, గోల్డ్ దేవరాజ్ వోకల్స్ ఈ సాంగ్‌కు మరింత ఎనర్జీని ఇచ్చాయి. ఈ సాంగ్‌కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
Also Read- Rahul Ramakrishna: కేసీఆర్, కేటీఆర్.. కలకలం రేపుతోన్న రాహుల్ రామకృష్ణ ట్వీట్స్!
ఆస్కార్ విజేత లిరిక్స్ గమనిస్తే..
‘‘అమెరిక నుండి వచ్చాను.. ఇక అస్సలు సత్యం చెబుతాను
అందరి కోసం వచ్చాను.. నా అనుభవసారం చెబుతాను
పర్మినెంట్ కాదు.. ఏదీ పర్మినెంట్ కాదు..
ఆ సొగసు, వయసు తెలివైన
మన పైసా, పదవి గెలుపైన
అరె.. కోపం, ధ్వేషం, అహమైనా
నాతో సరసం తప్ప పర్మినెంట్ ఏదీ కాదు కాదు కాదు’’.. అంటూ సాగిన ఈ పాటలో సముద్రఖని, వెన్నెల కిషోర్, నాగశౌర్య వంటి ప్రధానంగా కనిపించారు. ఇక ఈ పాటలో స్నేహా గుప్తా అందాలు, పాటకు అనుగుణంగా ఆమె ఇచ్చిన అభినయం కూడా వావ్ అనేలా ఉంది. హారిస్ జయరాజ్ మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నట్లుగా స్వరాలను సమకూర్చారు. సీనియర్ నరేష్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్ వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ డీవోపీగా పని చేస్తుండగా, రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు