PK comments Prakash Raj: ప్రకాశ్ రాజ్ పై క్లారిటీ ఇచ్చిన గంభీరా..
pawan-kalyan-og-(image :X)
ఎంటర్‌టైన్‌మెంట్

PK comments Prakash Raj: ‘ఓజీ’లో ప్రకాశ్ రాజ్ నటించడంపై క్లారిటీ ఇచ్చిన గంభీరా.. ఎందుకంటే?

PK comments Prakash Raj: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా విడుదలై సినిమా ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘ఓజీ’ బ్లాక్ బాస్టర్ మీట్ నిర్వహించారు నిర్మాతలు. ఈ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం అన్నారంటే.. ‘సినిమా మొదలయ్యే సమయంలో ప్రకాష్ రాజ్ ఉండటంపై మీకేమైనా ఇబ్బంది ఉందా అని టీం నన్ను అడిగింది. ఆయన చేయడంపై నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. మాకు పొలిటికల్ అభిప్రాయలు వేరు అంతే. అయినా అందరూ ఒకే అభిప్రాయంలో ఉండాలని ఎక్కడాలేదు. పొలిటికల్ అభిప్రాయాలు ఎప్పుడూ నావి బలంగా ఉంటాయి. కానీ సినిమా వేరు. సినిమాలో ఆయన అవసరం. కానీ సెట్ లో మాత్రం పొలిటికల్ గా ఏమీ మాట్లాడ వద్దని చెప్పండి. ప్రకాష్ రాజ్ గురించి పొలిటికల్ గా ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడతా కానీ వేదిక ఇది కాదు. పొలిటికల్ వేదికపై అలాంటివి మాట్లాడతా.. ఏది ఏమైనా ప్రకాష్ రాజ్ మంచి యాక్టర్’. అంటూ చెప్పుకొచ్చారు. దీనిని చూసిన పవన్ అభిమానులు అలా మాట్లాడినందుకు తెగ పొగుడుతున్నారు.

Read also-KV Schools: గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో 4 కేంద్రీయ విద్యాలయాలు కేటాయింపు

ఇక సినిమా విషయానికొస్తే.. ఫైర్ స్ట్రోమ్ ముంబాయ్ లో చేసిన విలయ తాండవానికి అభిమానులు మంత్రముగ్థులయ్యారు. ప్రతి సీన్ పవన్ కళ్యాణ్ కోసమే రాసినట్టుగా, అలాగే ప్రతి ఫ్రేమ్ తీసినట్లుగా చూసుకున్నాడు దర్శకుడు సుజిత్. ఇక థమన్ అందించిన సంగీతం వచ్చినపుడల్లా అభిమానులు అయితే ఒక రకమైన తన్మయత్వానికి గురయ్యారు. పవన్ కనిపించినంతసేపు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఎవరూ మర్చిపోలేరు. రెండో భాగంలో సినిమా బాగా ఆసక్తికరంగా మారుతుంది. ఎమోషనల్ డెప్త్ ప్రేక్షకులకు బాగా కనెక్టు అవుతుందు. ముగింపు ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఓమీ దేనికోసం సినిమా మొత్తం పోరాడాడో దానితోనే అంతమవుతాడు. చివరిగా పార్ట 2 కి అవకాశం ఉన్నా.. సినిమా ఉంటుందని ఎక్కడా రివీల్ చేయలేదు. మొత్తం గా ఈ సినిమా అభిమానులకు ఫుల్ మీల్ గా నిలుస్తోంది.

Read also-Ramreddy Damodar Reddy: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. సీనియర్ నేత కన్నుమూత.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

పవన్ కళ్యాణ్ అభినయం, ఎమ్రాన్ హాష్మీ విలన్ రోల్‌తో విడుదలైన ‘ది కాల్ హిమ్ ఓజీ’ (OG), టాలీవుడ్‌లో టెక్నికల్ ఎక్సలెన్స్‌కు మరో ఉదాహరణ. డైరెక్టర్ సుజీత్, తన స్క్రిప్ట్‌తో గ్యాంగ్‌స్టర్ లోకాన్ని రివైవ్ చేశాడు. ప్రొడ్యూసర్స్ డీ.వి.వి. దానయ్య, కల్యాణ్ దాసరి (సురేష్ ప్రొడక్షన్స్) బ్యాక్‌బోన్‌తో ఈ యాక్షన్ థ్రిల్లర్ షేప్ తీసుకుంది. టెక్నికల్ టీం సూపర్! సినిమాటోగ్రఫీలో రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస డ్యూయల్ వర్క్ – ముంబై అండర్‌వరల్డ్‌ను విజువల్ స్పెక్టాకల్‌గా మార్చారు. మ్యూజిక్ కంపోజర్ థమన్ ఎస్, హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్‌కు బీట్స్ ఇచ్చాడు. ఎడిటర్ నవీన్ నూలి, పేసింగ్‌ను టైట్‌గా హ్యాండిల్ చేశాడు. ప్రొడక్షన్ డిజైనర్ ఏ.ఎస్. ప్రకాశ్, 1990ల ముంబై లుక్‌ను రియలిస్టిక్‌గా సెట్ చేశారు. ఓవరాల్ గా మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో టీం సంబరాలు చేసుకుంటుంది.

Just In

01

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!