Avika Gor: ‘చిన్నారి పెళ్లికూతురు’ (Chinnari Pellikuthuru)కు మూడు ముళ్లు పడ్డాయి. అవును.. ఆమె వివాహబంధంలోకి అడుగు పెట్టారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవికా గోర్ అందరికీ పరిచయమే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో పరిచయమైన అవికా గోర్.. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. నటిగా మంచి గుర్తింపును కూడా సొంతం చేసుకుంది. సినిమాల కంటే ముందు.. ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో విశేషమైన గుర్తింపును పొందిన అవికా గోర్.. హీరోయిన్‌గానూ తన సత్తా చాటింది. ఇప్పుడామె తన ప్రియుడు మిళింద్ చద్వానీని సెప్టెంబర్ 30న వివాహం చేసుకుని, మరో కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేశారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి.. ‘బాలిక నుంచి వధువు వరకు’ అనే క్యాప్షన్‌ను జోడించింది. ఇప్పుడా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read- Innovative idea: భలే ఐడియా గురూ!.. రూ.16 లక్షల ఫ్లాట్ ఎవరూ కొనడం లేదని.. ‘మేధావి ప్లాన్’
ప్రేమికుడితోనే పెళ్లి
అవికా గోర్ (Avika Gor) వివాహమాడిన మిళింద్ చద్వానీ (Milind Chandwani) విషయానికి వస్తే.. క్యాంప్ డైరీస్ పేరిట ఆయన ఓ ఎన్టీవోను నడుపుతున్నారు. పారిశ్రామిక వేత్తే కాకుండా ఆయన సామాజిక కార్యకర్త కూడా. సాప్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి ‘రోడీస్ రియల్ హీరోస్’ షో వరకు ఉన్న ఆయన జర్నీలో అవికా గోర్ పరిచయం అవడం.. వారిద్దరి మధ్య స్నేహం, తర్వాత ప్రేమ పుట్టడం, ఆ ప్రేమ పెద్దల వరకు చేరి, వారు కూడా ఓకే చెప్పడంతో.. వారి ప్రేమ పెళ్లి పీటల వరకు చేరింది. ఇప్పుడు తన ప్రియుడుని పెళ్లాడి, సంతోషకరంగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. ఆమె సంతోషం ఆమె పోస్ట్‌లోనే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె పోస్ట్‌కు నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తున్నారు. చిన్నారి పెళ్లికూతురు.. ఇప్పుడు రియల్ పెళ్లికూతురైంది అంటూ నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also Read- Mass Jathara: ఫైనల్‌గా ‘మాస్ జాతర’ రిలీజ్ ఎప్పుడంటే.. ఆసక్తికర వీడియో వదిలిన మేకర్స్!
రియాలిటీ షో సెట్స్‌లో..
అవికా గోర్, మిళింద్ చద్వానీల వివాహం (Avika Gor and Milind Chandwani Marriage) రియాలిటీ షో సెట్స్‌లో జరగడం విశేషం. ‘ఉయ్యాలా జంపాలా’తో సక్సెస్ అందుకున్న అవికా గోర్ ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజుగారి గది 3’ వంటి అనేక సినిమాలలో నటించింది. మధ్యలో ఆమెకు టాలీవుడ్ నుంచి సరిగా అవకాశాలు రాకపోవడంతో, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టి, సరికొత్త అందాలతో ఆమె మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీలో ఆమె చేసిన ‘షణ్ముఖ’ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఇక ఇప్పుడు తన భర్తతో కలిసి ఏడడుగులు వేసి, కొత్త లైఫ్‌ని స్టార్ చేశారు. మరి పెళ్లి తర్వాత కూడా ఆమె నటిస్తుందా? లేదా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు