Jatadhara: నవ దళపతి సుధీర్ బాబు (Sudheer Babu), బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘జటాధర’ (Jatadhara). అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందించేందుకు సిద్ధమవుతోన్న ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుందని ఈ సినిమా మేకర్స్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. వారు చెబుతున్నట్లుగా ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తుంది. ఇక ఈ సినిమా టీజర్ రిలీజ్ తర్వాత.. ఒక్కసారిగా అంచనాలు అమాంతం పెరిగాయి. అలాగే ఫస్ట్ ట్రాక్ ‘సోల్ ఆఫ్ జటాధర’ కూడా మంచి స్పందనను రాబట్టుకుని ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో మేకర్స్ సినిమా నుంచి మరో సాంగ్‌ని వదిలారు. ఆ సాంగ్ విషయానికి వస్తే..
Also Read- Republic: ‘రిపబ్లిక్’కు నాలుగేళ్లు.. సాయి దుర్గ తేజ్ ప్రమాదానికి కూడా!
సోనాక్షి సిన్హా పెర్ఫార్మెన్స్ అదిరింది..
విజయదశమి కానుకగా ఈ సినిమా నుంచి సోనాక్షి సిన్హా వీరోచిత పాత్రకు సంబంధించి ‘ధన పిశాచి’ (Dhana Pisaachi Lyrical Song) అంటూ సాగే సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. సమీరా కొప్పికర్ ఈ సాంగ్‌కు పవర్ ఫుల్ ట్రాక్ కంపోజ్ చేశారు. శ్రీ హర్ష ఈమని టెర్రిఫిక్ లిరిక్స్ అందించిన ఈ పాటను సాహితీ చాగంటి ఆలపించారు. ఈ పాటలో సోనాక్షి సిన్హా పెర్ఫార్మెన్స్ చూసిన వారంతా అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. సోనాక్షికి పర్ఫెక్ట్ టాలీవుడ్ ఎంట్రీ ఇదనేలా ఈ పాటకు రెస్పాన్స్ వస్తుందంటే.. ఏ రేంజ్‌లో ఆమె ఈ పాటలో అభినయించారో అర్థం చేసుకోవచ్చు. ఆమె కాస్ట్యూమ్స్, సెట్స్ అన్నీ కూడా వావ్ అనేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సోనాక్షి ధన పిశాచిగా కనబరిచిన అభినయానికి అంతా ఫిదా అవుతున్నారు.
Also Read- Mass Jathara: ఫైనల్‌గా ‘మాస్ జాతర’ రిలీజ్ ఎప్పుడంటే.. ఆసక్తికర వీడియో వదిలిన మేకర్స్!
క్యాస్ట్ అండ్ క్రూ వీరే..
జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని.. ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్షయ్ కేజ్రీవాల్, కుస్సుమ్ అరోరా సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి డివ్యా విజయ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, భావిని గోస్వామి సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సినిమాకి పవర్ ఫుల్ సౌండ్‌స్కేప్‌ను జీ మ్యూజిక్ అండ్ కో అందిస్తోంది. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్ వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా సుధీర్ బాబుకు కూడా ఎంతో కీలకం కానుంది. ప్రస్తుతం ఆయనకు మంచి హిట్ కావాలి. ఆ హిట్‌ని ఈ సినిమా ఇస్తుందనే నమ్మకంతో ఆయన కూడా ఉన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు