Republic Sai Durgha Tej
ఎంటర్‌టైన్మెంట్

Republic: ‘రిపబ్లిక్’కు నాలుగేళ్లు.. సాయి దుర్గ తేజ్ ప్రమాదానికి కూడా!

Republic: దేవా కట్టా, సాయి దుర్గ తేజ్ కాంబోలో వచ్చిన ‘రిపబ్లిక్’ (Republic) మూవీ సరిగ్గా నాలుగు సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ మూవీ అప్పట్లో అందరిలోనూ ఎన్నో ఆలోచనల్ని రేకెత్తించింది. రాజకీయాలు, అవినీతి, సమాజంలోని అసమానతల నేపథ్యంలో దర్శకుడు దేవా కట్టా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు.. సమాజాన్ని ప్రతిబింబించే భావోద్వేగంగా అంతా ఈ సినిమాను కొనియాడారు. సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా నటుడిగా సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) స్థానాన్ని సుస్థిరం చేసిన సినిమాగా ‘రిపబ్లిక్’ నిలుస్తుందనడంలో అస్సలు అతిశయోక్తి లేదు. వ్యవస్థాగతంగా కుళ్ళిపోయిన సమాజంలో విధి నిర్వహణలో ఉన్న ఐఏఎస్ అధికారిగా ఇందులో సాయి దుర్గ తేజ్ అసమానమైన నటనను కనబర్చారు. సినిమా చూసిన వారంతా, సోషల్ మీడియా వేదికగా దర్శకుడు దేవా కట్టా (Deva Katta)ని అభినందించిన వారే కానీ, నెగిటివ్‌గా కామెంట్ చేసిన వారు ఒక్కరూ లేరంటే.. ఏ రేంజ్‌లో సినిమాను ఆయన రూపొందించారో అర్థం చేసుకోవచ్చు. ‘రిపబ్లిక్’ మూవీ నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.

Also Read- Mass Jathara: ఫైనల్‌గా ‘మాస్ జాతర’ రిలీజ్ ఎప్పుడంటే.. ఆసక్తికర వీడియో వదిలిన మేకర్స్!

ఆ ప్రమాదానికి కూడా నాలుగేళ్లు..

‘రిపబ్లిక్’ సినిమా విడుదలకు కొన్ని వారాల ముందే, సాయి దుర్గ తేజ్ ప్రమాదానికి గురయ్యారనే విషయం తెలియంది కాదు. ఈ సినిమా ప్రమోషన్స్‌కి కూడా ఆయన అందుబాటులో లేరు. చాలా క్లిష్టకాలంలో విడుదలైన ఈ చిత్రం అందరి ప్రశంసల్ని అందుకుంది. సాయి దుర్గ తేజ్‌కు ఈ ప్రమాదం జరిగిందని తెలిసి, మెగా ఫ్యామిలీనే కాదు, మెగా అభిమానులు కూడా ఎన్నో పూజలు చేశారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని, ఎంతగానో ప్రార్థించారు. అందరి ప్రార్థనలు ఫలించి ఆయన క్షేమంగా బయటకు వచ్చారు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఆయన చేసిన ‘విరూపాక్ష’ (Virupaksha) చిత్రం ఏప్రిల్ 2023న విడుదలై, సాయి దుర్గ తేజ్ కెరీర్‌లోనే భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ మూవీ రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి ఓ చరిత్రగా సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో నిలిచిపోయింది. ఆ సినిమా తర్వాత చేసిన ‘BRO’ మూవీతో తన గురువు, తన మామ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుని తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నారీ సుప్రీమ్ హీరో.

Also Read- Kantara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’ ప్రీమియర్ షోస్ రద్దు.. కారణమిదే!

‘సంబరాల యేటి గట్టు’ టీజర్ గ్లింప్స్ ఎప్పుడంటే..

ప్రమాదం తర్వాత ఆయన హీరోగా చేసిన ఈ సినిమాలు సాయి దుర్గ తేజ్ స్పార్క్ తగ్గలేదని నిరూపించాయి. ఇప్పుడు రెండున్నర సంవత్సరాల అవిశ్రాంత కృషి తర్వాత సాయి దుర్గ తేజ్ ‘సంబరాల యేటి గట్టు’ సినిమాతో తనని తాను మరింత కొత్తగా ఆవిష్కరించుకునేందుకు రెడీ అయ్యారు. ఈ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం సాయి దుర్గ తేజ్ తన శరీరాకృతిని మార్చుకున్న విధానం చూస్తే నిజంగా మెంటలొచ్చేస్తుంది. అంత పెద్ద ప్రమాదం తర్వాత ఏ స్టార్ కూడా ఇలాంటి ప్రయోగం చేయరు. కానీ సాయి దుర్గ తేజ్ మాత్రం, నిరంతరం శ్రమించి బాడీని బిల్డ్ చేసిన విధానం చూసిన వారంతా.. ఆయనలోని నిబద్ధతని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇక ‘సంబరాల యేటి గట్టు’ విషయానికి వస్తే.. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రోహిత్ కెపి దర్శకత్వంలో.. దాదాపు రూ. 125 కోట్ల బడ్జెట్‌తో భారీ ఎత్తున ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదలకానున్న ఈ చిత్రం నుంచి సాయి దుర్గ తేజ్ పుట్టినరోజు (అక్టోబర్ 15) పురస్కరించుకుని ‘అసుర ఆగమన’ అంటూ టీజర్‌ గ్లింప్స్‌ను ‘కాంతారా: చాప్టర్ 1’తో పాటుగా స్క్రీన్లలో ప్రదర్శించనున్నారు. ఈ టీజర్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

MLC Kavitha: ఈటల రాజేందర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు!.. క్షమాపణ చెప్పాలని డిమాండ్!

DGP Shivdhar Reddy: స్థానిక సంస్థల ఎన్నికలే నా మొదటి ఛాలెంజ్: డీజీపీ శివధర్ రెడ్డి

Mutton Soup Teaser: ‘మటన్ సూప్’ టీజర్‌పై అనిల్ రావిపూడి స్పందనిదే..

GHMC: మూసారాంబాగ్ బ్రిడ్జి మార్చి కల్లా పూర్తి.. మరో రెండు బ్రిడ్జిల జీహెచ్ఎంసీ డెడ్ లైన్

Harish Rao: జాతీయ నేర గణాంక నివేదిక లెక్కలు కాంగ్రెస్‌కు చెంపపెట్టు: హరీష్ రావు