Harish Rao (imagecredit:twitter)
Politics, తెలంగాణ

Harish Rao: జాతీయ నేర గణాంక నివేదిక లెక్కలు కాంగ్రెస్‌కు చెంపపెట్టు: హరీష్ రావు

Harish Rao: రైతు ఆత్మహత్యల తెలంగాణను.. అన్నపూర్ణ తెలంగాణగా మార్చింది కేసీఆర్(KCR) అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) అన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచే రైతు సంక్షేమ పథకాలు ప్రారంభించి సాగును బాగు చేసిన వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో 2014లో 1347 రైతు ఆత్మహత్యలు నమోదు కాగా, 2023 నాటికి 56కి తగ్గాయన్నారు. 2014లో రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ నేడు 14 వ స్థానికి పరిమితం అయిందని, 2023లో దేశవ్యాప్తంగా 10,786 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా అందులో తెలంగాణ వాటా కేవలం 0.51% మాత్రమే అన్నారు.

కేంద్ర ప్రభుత్వ లెక్కలు

10 ఏళ్ల బీఆర్ఎస్(BRS) పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు రికార్డు స్థాయిలో 95.84% తగ్గాయన్నారు. ఇవి మాటలు కాదు.. కేసీఆర్ తిరగరాసిన రికార్డులు, కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్న వాస్తవాలు అని స్పష్టం చేశారు. రైతును రాజు చేయాలన్న కేసీఆర్ సంకల్పానికి, వారు చేసిన నిర్విరామ కృషికి వచ్చిన ఫలితం ఇదంతా అని వెల్లడించారు. స్వరాష్ట్రంలో ఒక్కో పథకంతో వ్యవసాయరంగానికి జీవం పోశారని, సాగును బాగు చేశారన్నారు.

Also Read: Maa Mundeshwari Temple: దేశంలోనే వింతైన ఆలయం.. మేకను బలిస్తారు కానీ.. ఒక్క చుక్క రక్తం కారదు!

రైతు బీమా కొండంత భరోసా

రుణమాఫీతో రైతన్నకు ధీమా దొరికిందని, రైతు బంధు బంధువు అయ్యిందని, రైతు బీమా కొండంత భరోసా ఇచ్చిందన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్తు వెలుగులు నింపిందన్నారు. పంట కొనుగోళ్లతో ప్రోత్సాహం అందిందని, కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటి గోస తీరిందని, మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ జరిగిందని, భూగర్భ జలాలు ఉబికి బీడు భూములను పంట పొలాలుగా మార్చిందన్నారు. ఉమ్మడి పాలనలో నిత్య దుర్భిక్షం, సాగు విధ్వంసం, వలసల దురవస్థ, ఆత్మహత్యల దౌర్భాగ్యం..తెలంగాణ! స్వరాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులతో సుజలమై, ధాన్యపురాశులతో సుఫలమై, సాగుభూమి సస్యశ్యామలమై.. కేసీఆర్‌ పాలనలో విరాజిల్లింది తెలంగాణ అని పేర్కొన్నారు. తెలంగాణను అన్నంగిన్నెగా దేశానికే ఆదర్శంగా నిలిపింది, ఆత్మహత్యల తెలంగాణను, అన్నపూర్ణగా మార్చింది కేసీఆర్ అని వివరించారు. కేసీఆర్ పాలన గురించి నోరు పారేసుకునే వారికి ఇది చెంపపెట్టు సమాధానం అన్నారు. కేసీఆర్ కు రైతుకు ఉన్నది పేగు బంధం, ఆత్మ బంధం అయితే.. కాంగ్రెస్ కు ఉన్నది కేవలం ఓటు బంధం అని దుయ్యబట్టారు.

Also Read: Dimple Hayathi: పెంపుడు కుక్కల వ్యవహారం.. మరో కాంట్రవర్సీలో డింపుల్ హయాతి!

Just In

01

Hydraa: నాలాల సమీపంలోని నివాసేతర భవనాలను హైడ్రా కూల్చివేత!

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

CPI: సీపీఐ వందేళ్ల ముగింపు ఉత్సవాలు ఆ జిల్లాలోనే?: పల్లా వెంకటరెడ్డి

Innovative idea: భలే ఐడియా గురూ!.. రూ.16 లక్షల ఫ్లాట్‌ ఎవరూ కొనడం లేదని.. ‘మేధావి ప్లాన్’

KTR: బోరబండ యువకులకు ‘డాక్టర్ గార్డ్’ కంపెనీ ఏర్పాటు: కేటీఆర్