Bigg Boss 9 Telugu Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం (అక్టోబర్ 1) ఎపిసోడ్ కు సంబంధించిన మెుదటి ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో అసాంతం ఫుల్ ఆఫ్ ఫైర్ లో సాగడం.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ మరో లెవల్లో ఉంటుందని ప్రోమోను బట్టి అర్థమవుతోంది.
ప్రోమోలో ఏముందంటే?
ప్రోమో ప్రారంభం కాగానే.. ఇంటి సభ్యులకు బిగ్ బాస్ గోల్డెన్ ఆవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఇంట్లోని గార్డెన్ ఏరియాలో ఎవరికి అందనంత ఎత్తులో ఒక నెట్ ను ఏర్పాటు చేశారు. అందులో కలర్ బాల్స్ వేశారు. తాను చెప్పిన కలర్ బాల్ ను టీమ్ లీడర్స్ కర్రతో బయటకు పుష్ చేయాలని ప్రోమోలో బిగ్ బాస్ సూచించాడు. అలా కింద పడ్డ బాల్ ను టీమ్ లోని సభ్యులు పోటీపడి దక్కించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బిగ్ బాస్.. బ్లూ కలర్ అని ప్రకటించగా.. లీడర్స్ బ్లూ బాల్ ను కిందపడేస్తారు. అప్పుడు ఆ బాల్ ను ఇమ్మాన్యుయేల్ క్యాచ్ అందుకోవడం ప్రోమోలో చూపించారు.
తనూజ ముఖంపై దాడి
నెట్ నుంచి పడ్డ బాల్స్ ను పట్టుకునే క్రమంలో ఇంటి సభ్యురాలు తనూజకు ముఖంపై తోటి కంటెస్టెంట్ దాడి చేసినట్లు తెలుస్తోంది. తన మూతిపై దాడి చేశారంటూ ఆమె ప్రోమోలో గట్టిగా ప్రశ్నించడాన్ని చూడవచ్చు. దీంతో పవన్ కళ్యాణ్, ఇమాన్యూయేల్ ఆమెకు నచ్చజెప్పడం గమనించవచ్చు.
Also Read: ibomma Warning: టాలీవుడ్‌కు ఐబొమ్మ బిగ్ వార్నింగ్.. స్టార్ హీరోలపై సంచలన ఆరోపణలు
తనూజ ఔట్
మరోవైపు బ్లాక్ బాల్ కింద పడేలా చేసిన టీమ్ నుంచి ఒక కంటెస్టెంట్ ను తొలగించాలని సంచాలక్ గా ఉన్న డెమోన్ పవన్ కు బిగ్ బాస్ సూచిస్తాడు. దీంతో అతడు తనూజను ఆట నుంచి ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రకటిస్తాడు. అయితే టీమ్ సభ్యురాలిని కాకుండా టీమ్ లీడర్ ను తొలగించాలని మరో కంటెస్టెంట్ పవన్ కళ్యాణ్.. కెప్టెన్ తో వాదనకు దిగడాన్ని ప్రోమోలో చూడవచ్చు. మెుత్తంగా బుధవారానికి సంబంధించిన ఫస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది.