People Media Factory: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రేక్షకులకు అదిరిపోయే అప్డేట్‌తో రెడీ అయ్యింది. హరర్ జోనర్ లో ఓ సినిమా రాబోతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పటికే ఈ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు హిట్ కావడంతో రాబోయే సినిమాలపై కూడా అంచనాలు పెంచేసింది. అయితే ఈ సినిమా రాజుగారి గది 4 అయి ఉంటుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే మూవీ టీం కూడా నాలుగు నంబర్ తో ఉన్న పస్టర్ ను విడుదల చేశారు. అయితే ఇది రాజుగారి గది 4 అయి ఉంటుందని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ దసరా సందర్భంగా అక్టోబర్ రెండో తేదీన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
Read also-Lions In Beach: ఆడ సింహాల ఒత్తిడి.. ఫ్యామిలీతో బీచ్‌లకు వెళ్తోన్న మగ సింహాలు.. ఇదేందయ్యా ఇది!
తెలుగు సినిమా పరిశ్రమలో అనేక నిర్మాణ సంస్థలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వాటిలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 2017లో స్థాపించబడిన ఈ సంస్థ, టీ.జీ. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల చేత ప్రారంభించబడింది. భారతదేశవ్యాప్తంగా చలన చిత్ర నిర్మాణం, ఉత్పత్తి సేవలు అందిస్తోంది. సంస్థ సీఈఓగా టీ.జీ. విశ్వప్రసాద్ పనిచేస్తున్నారు. వారి సాంకేతిక కార్పొరేట్ నేపథ్యం సినిమా రంగంలో కొత్త ఆవిష్కరణలకు దారితీస్తోంది. 2025 నాటికి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇంకా ఎక్కువ ప్రాజెక్టులతో ముందుకు సాగుతోంది. 2025లో విడుదలైన ‘మిరాయ్’ విజయంతో మంచి నర్మాణ సంస్థగా పేరుతెచ్చుకుంది.
Read also-Hyderabad Collector: గాంధీ జయంతి ఏర్పాట్లను స్పీడప్ చేయాలి.. కలెక్టర్ హరిచందన కీలక అదేశాలు
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో ‘ది రాజసాబ్’ రాబోతుంది. ఈ హారర్ కామెడీ జానర్ లో రాబోతున్న ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలై ఇప్పటికే దూసుకుపోతుంది. ఇటీవల ‘గరివిడి లక్ష్మి’ చిత్రంలో ఆనంది ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ, ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రదర్శించే డీప్ కల్చర్ సినిమాను ప్రకటించారు. టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ నిర్మాణంలో ఈ చిత్రం, సంస్థ అర్థవంతమైన కథనాలపై దృష్టిని తెలియజేస్తోంది. ఇవే కాంకుండా అనేక ప్రాజెక్టులు ఈ నిర్మాణ సంస్థ చేపడుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కేవలం చిత్రాలను నిర్మించడమే కాకుండా, కథల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేయడంలో ముందంజలో ఉంది. దాని ప్రతిభలపై నమ్మకం, ఆవిష్కరణలు విజయవంతమైన ప్రాజెక్టులు దీనిని తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖ నిర్మాణ సంస్థగా మార్చాయి.
Not all blessings come with peace…
Some bring fear 🔥This VIJAYADASHAMI,
A DIVINE HORROR BEGINS on October 2nd, 2025 at 9:55 AM ❤️🔥❤️🔥❤️🔥Stay tuned for the scream of silence. 💥@vishwaprasadtg #KrithiPrasad @peoplemediafcy pic.twitter.com/CdXNSqdpD9
— People Media Factory (@peoplemediafcy) October 1, 2025