Local Body Elections (imagecredit:twitter)
Politics

Local Body Elections: నోటిఫికేషన్ వచ్చేలోగా.. రిజర్వేషన్ల ప్రక్రియలో మార్పులు చేర్పులు?

Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు ప్రకటించిన రిజర్వేషన్లు రాజకీయ నేతలకు తలనొప్పిగా మారాయి. పలుచోట్ల గందరగోళానికి దారితీశాయి. పలు గ్రామాల్లో ఆ కులానికి చెందిన వారు లేకపోయినా ఆగ్రామానికి రిజర్వేషన్ ను అధికారులు రొటేషన్ పద్దతిలో కేటాయించారు. దీంతో గంధర గోళానికి దారితీసింది. ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC) జనాభా లేని గ్రామాల్లో ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ప్రకటించడమే కారణం. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా తక్కువగా ఉన్న పల్లెల్లోనూ ఆయా వర్గాలకు స్థానాలు రిజర్వ్ చేయడంతో ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన మిగిలిన వర్గాల ఆశావహులు నిరాశకు గురవుతున్నారు.

నామినేషన్ వేస్తే అవకాశాలు..

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీ డెడికేటెడ్​కమిషన్​ నివేదిక ప్రకారం బీసీ రిజర్వేషన్లు ప్రకటించామని, 14 ఏండ్ల క్రితం గ్రామాల్లో ఉన్న ఆయా వర్గాలు వలస వెళ్లడం వల్ల కొన్ని చోట్ల సమస్యలు వస్తున్నాయని మిగిలిన చోట్ల ఎలాంటి సమస్య లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు తిరిగివచ్చి నామినేషన్ వేస్తే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి రిజర్వ్​అయ్యాక ఎవరూ నామినేషన్​ వేయకపోతే… ఆ గ్రామాన్ని వెకెన్సీ లిస్ట్​లో చూపించి మళ్లీ నోటిఫికేషన్​ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. జనాభా లెక్కల సేకరణలో కేంద్ర ప్రభుత్వం వాయిదా వేస్తూ రావడంతో తాజాగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు అధికారులు 2011 జనాభా లెక్కలనే ప్రామాణికంగా తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గతంతో పోలిస్తే బీసీ రిజర్వేషన్ శాతం పెరగడం, రిజర్వేషన్లు రోటేషన్ పద్ధతిలో కేటాయించడంతో పొరపాట్లు జరిగినట్లు తెలుస్తోంది.

Also Read: Kunamneni Sambasiva Rao: ప్రజాస్వామ్యానికి పునాదులు అవే.. సీపీఐ నేత కూనంనేని కీలక వ్యాఖ్యలు

పాతిక గ్రామాల నుంచి ఫిర్యాదులు..

స్థానిక ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో ఆశావాహులు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల వద్దకు క్యూ కడుతున్నారు. తమ గ్రామంలో బీసీలు ఎక్కువగా ఉన్నా ఎస్సీ కి కేటాయించారని, ఎస్టీ, ఎస్సీలు లేకున్నా తమ గ్రామాన్ని రిజర్వుడు చేశారని ఆ రిజర్వేషన్ మార్చాలను ఒత్తిడి పెంచుతున్నారు. వినతులు అందజేస్తున్నారు. ఈ అంశాలపై ప్రభుత్వ ఆదేశాలమేరకు పంచాయతీ శాఖ అధికారులు సైతం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. ఏయే గ్రామాల నుంచి ఫిర్యాదుల వస్తున్నాయని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇప్పటివరకు పాతిక గ్రామాల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా రిజర్వేషన్ ప్రక్రియలో మార్పులు, చేర్పులు చేస్తారా? అనేదానిపై చర్చమొదలైంది. పంచాయతీరాజ్ అధికారులకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని సమాచారం. అయితే ఏ గ్రామంలో అయితే అభ్యర్థులు నోటిఫికేషన్ వేయరో ఆయా గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల్లో ఆ కులస్తులు లేరని వెకెన్సీ లిస్టు తయారు చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల తర్వాత ఈసీ అనుమతితో మళ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేయనున్నట్లు సమాచారం.

Also Read: Jupally Krishna Rao: అబద్దాలపై బతకడం కేటీఆర్‌కు అలవాటు.. మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు!

Just In

01

Global Summit Telangana: గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు స్థల పరిశీలన చేసిన ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క

Miryalaguda: మిర్యాలగూడ అభివృద్ధిపై ఫోకస్.. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay: యువత రాజకీయాల్లోకి రావాలి… కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపు

VC Sajjanar: కరేబియన్ పౌరసత్వo.. 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా.. 21వేల సినిమాలు.. ఐబొమ్మ రవి చిట్టా ఇదే!

Chain Snatching: ఎంతకు తెగించార్రా.. ఉదయాన్నే బరితెగించిన చైన్ స్నాచర్స్