Srinivas Goud: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలతో పాలన సాగిస్తోందని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్(Srinivass Goud) ఆరోపించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలయ్యాయని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని, ప్రజలను కొన్ని సార్లు మోసం చేయవచ్చు. అన్ని సార్లు మోసం చేయలేరన్నారు. బీసీ(BC) లకు 42 శాతం రిజర్వేషన్ల పై అదే మోసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. రిజర్వేషన్ల పెంపు పై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఇప్పుడు జీవో తెచ్చారు ..ఆరునెలల లోపే రిజర్వేషన్లు పెంచుతామన్నారు.
ఇతర రాష్ట్రాల్లో జీవో..
అప్పుడే ఎందుకు జీవో తేలేదని నిలదీశారు. జీవో తోనే పని అయ్యేదుంటే అసెంబ్లీ లో ఏక గ్రీవ తీర్మానం ఎందుకు ,బిల్లు గవర్నర్ ,రాష్ట్రపతి దగ్గరకు ఎందుకు ? అని ప్రశ్నించారు. జీవో తెచ్చినట్టే తెచ్చి కోర్టులో కేసులు వేయించారని ఆరోపించారు. కోర్టు లో కేసు ఉన్నా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని, ఈ జీవో చెల్లదని వారి ఆత్మసాక్షికి తెలియదా ? అన్నారు. ఇతర రాష్ట్రాల్లో జీవో ద్వారా రిజర్వేషన్లు పెంచితే కోర్టులు కొట్టేశాయని ఈ ప్రభుత్వానికి తెలియదా ? ఆసెంబ్లీ లో బిల్లును ఆమోదించి ప్రధానిని ఎందుకు కలవలేదు.. ఆయన దగ్గరకు అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకెళ్ల లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: Marriage Gift Scheme: పెళ్లి చేసుకునే అమ్మాయిలకు ప్రభుత్వ కానుక.. కానీ, వారు మాత్రమే అర్హులు!
రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లో..
కాంగ్రెస్ బీజేపీ లు కలిసి బీసీ లకు రిజర్వేషన్లు దక్కకుండా కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. బీసీ లను ఈ ప్రభుత్వం ఆర్థికంగా దివాళా తీయించాలనుకుంటుందా ? చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ లను కాంగ్రెస్ తెలివి లేని వాళ్ళుగా భావోస్తోందా ? అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్(Kamareddy Declaration) లో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని అమలు చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లో ఉన్న హామీలు కూడా అమలు చేయడం లేదన్నారు. విద్యా ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు జీవో ఎందుకు జారీ చేయలేదు. తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చినపుడే బీసీ రిజర్వేషన్ల పెంపునకు చట్టబద్దత వస్తుంది తప్ప ఇంకో మార్గం లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు కాంగ్రెస్ ఏ ప్రయత్నం చేసినా బీ ఆర్ ఎస్ సహకరిస్తుందన్నారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ల కు అనుగుణంగా కాంగ్రెస్ కేబినెట్లో నామినేటెడ్ పోస్టుల్లో నియామకాలు జరగాలని డిమాండ్ చేశారు.
Also Read: Indiramma Canteens: హైదరాబాదీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేవలం రూ.5కే వెరైటీ టిఫిన్స్, భోజనం