Viral Video: సాధారణంగా 70 ఏళ్ల వయసులో చాలా మందిలో సత్తువ తగ్గిపోతుంది. కొందరైతే కనీసం కాలు కదపడానికి సైతం తెగ ఇబ్బంది పడుతుంటారు. టేబుల్ పైన ఉన్న వస్తువులను అందుకోలేక అల్లాడిపోతుంటారు. అలాంటి వయసులో ఒక వృద్ధ జంట.. దాండియా అడి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం వారి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వీడియో ఏముందంటే?
ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన దాండియా వీడియోలో ఇద్దరు వృద్ధులు నృత్యం చేస్తూ కనిపించారు. సంప్రదాయ దుస్తుల్లో వారు చేసిన డ్యాన్స్ చూపరులను ఫిదా చేసింది. ఈ క్రమంలో మరికొందరు వారితో కలిసి దాండియా చేయడం వీడియోలో చూడవచ్చు. వృద్ధ జంటను చూస్తూ వారు మరింత ఉత్సాహాన్ని డ్యాన్స్ చేయడం గమనించవచ్చు. ఈ వీడియోను చూసి ఒక్కసారిగా నెటిజన్లు అవాక్కవుతున్నారు. వృద్ధ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: Old Age Couple: 80 ఏళ్ల వయసులో వృద్ధ జంట ఆత్మహత్య.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!
ఇద్దరూ బెస్ట్ కపూల్
వృద్దుల దాండియా వీడియో పై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ పెట్టారు. ఓ యూజర్ స్పందిస్తూ.. ‘ఇద్దరికి బెస్ట్ కపుల్ అవార్డు.. బెస్ట్ ఔట్‌ఫిట్ అవార్డు ఇవ్వాలి’ అని రాశారు. మరొకరు సరదాగా.. ‘వారి వెన్నునొప్పి మూలన కూర్చుని నవ్వుకుంటోంది. ఇంత ఎనర్జీతో నవరాత్రి సెలబ్రేషన్ అదిరిపోయింది’ అని కామెంట్ చేశారు. ఇంకొకరు ‘ఆ జంటకు నా ప్రేమను తెలియజేయండి. డ్యాన్స్ ఫ్లోర్ మీద వారిద్దరూ అల్లాడించారు’ అని ప్రశంసించారు.
View this post on Instagram