Mahakali: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా వచ్చిన ‘హనుమాన్’ (HanuMan) సినిమా తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma).. తన సినిమాటిక్ యూనివర్స్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌తో ఆయనలో కాన్ఫిడెంట్ పెరడగంతో.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (Prasanth Varma Cinematic Universe) అని ప్రకటించి, అందులో రాబోయే సినిమాలను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారు. ‘హనుమాన్’ సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాతో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రెండు చిత్రాల ప్రకటన వచ్చాయి. అందులో ఒకటి ‘అధీర’ కాగా, ఇటీవల ఈ సినిమా నుంచి కళ్యాణ్ దాసరి, ఎస్‌జే సూర్యల పాత్రలను రివీల్ చేశారు. ఈ సూపర్ హీరో సినిమాకు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. ఈ సినిమా కాకుండా ఇదే యూనివర్స్ నుంచి ‘మహాకాళి’ అనే మూవీ ప్రకటన కూడా వచ్చింది. ప్రకటన తర్వాత కొన్ని రోజులు హైలెట్ అయిన ఈ సినిమా.. ఆ తర్వాత ఎటువంటి అప్డేట్‌కు నోచుకోలేదు. ఇప్పుడు దసరా ఫెస్టివల్‌ను పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.
Also Read- Kodama Simham: మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ కౌబాయ్ మూవీ ‘కొదమసింహం’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్‌కు ఛావా నటుడు
‘మహాకాళి’ చిత్రంలో శుక్రాచార్యుడి పాత్రను మంగళవారం మేకర్స్ రివీల్ చేస్తూ, ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని, అందులో నటిస్తున్న నటుడి వివరాలను తెలిపారు. ఆర్‌కెడి స్టూడియోస్ పతాకంపై పూజ అపర్ణ కొల్లూరు (Puja Aparna Kolluru) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో శుక్రాచార్యుడిగా బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna As Shukracharya) నటిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘ఛావా’ సినిమాలో జౌరంగజేబు పాత్రలో అసాధారణమైన నటనతో అందరినీ మెస్మరైజ్ చేసిన అక్షయ్ ఖన్నా.. ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ‘ఛావా’ తర్వాత వరుస ఆఫర్లు ఆయనకు వెతుక్కుంటూ వచ్చినా, కథాబలంతో పాటు తన పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్‌ను చూసుకునే ఆయన సినిమాలు ఓకే చేస్తున్నారు. ఈ క్రమంలో ‘మహాకాళి’ సినిమాలో అక్షయ్ ఖన్నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ క్రియేటర్, షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు.
Also Read- Kishkindhapuri OTT: దీపావళికి బ్లాస్ట్.. ‘కిష్కింధపురి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?
అసురుల గురువుగా..
శుక్రాచార్యుడి ఫస్ట్ లుక్ విషయానికి వస్తే.. హిందూ పురాణాల ప్రకారం అసురులకు గురువైన శుక్రాచార్యుడి పాత్రలో అక్షయ్ ఖన్నా ఇందులో నటిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఒక భారీ పర్వత కోట ముందు ఆయన నిలబడి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కోట చుట్టూ ఎత్తైన రాతికొండలు కనిపిస్తున్నాయి. తుఫాను మేఘాలు కమ్ముకున్న ఆకాశం కింద, పురాతన బలిపీఠాల మంటలు నుంచి ఎగసిపడుతున్న కాంతి ఈ ఋషిపై ప్రకాశిస్తోంది. పొడవైన గడ్డం, తపస్వి వస్త్రాలు, చీకటిని చీల్చే తేజోవంతమైన కళ్ళతో ఉన్న ఈ పోస్టర్, దేవతల, రాక్షసుల విధిని రూపొందించిన ఒక శక్తివంతమైన జ్ఞాని ఉనికిని తెలియజేస్తుంది. ఆయన ఒక నేత్రం ప్రకాశవంతంగా కనిపిస్తోంది. సనాతన విద్యలో నిష్ణాతుడిగా, మరణించిన వారిని తిరిగి బ్రతికించే శక్తి గల మృత-సంజీవని మంత్రం యొక్క రహస్యాల కాపరిగా శుక్రాచార్యుడు ప్రసిద్ధి చెందారు. ఆయన ఆధ్యాత్మిక మార్గదర్శిగా, అసురులకు అపరాజిత వ్యూహకర్తగా కీర్తించబడ్డారనే విషయం తెలియంది కాదు. ఆయన కీర్తికి అనుగుణంగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌ని ప్రశాంత్ వర్మ రియాక్ట్ అవుతూ.. ‘మా యూనివర్స్‌కు మరో కొత్త శక్తి యాడైంది. భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. అసలైన సూపర్ హీరోలు ఎలా ఉంటారో.. ఈ సినిమా తెలియజేస్తుంది’ అని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు