Kodama Simham: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అభిమానులకు దసరా పండుగ స్పెషల్‌గా మరో అద్భుతమైన ట్రీట్ రెడీ అవుతుందనే ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అందరూ ‘ఓజీ’ మేనియాలో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి సినిమాలలో అందరూ ఎంతగానో ఇష్టపడే ఓ అద్భతమైన సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. చిరంజీవి కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిన బ్లాక్ బస్టర్ కౌబాయ్ మూవీ ‘కొదమసింహం’ (Kodama Simham). ఇప్పుడీ సినిమా అద్భుతమైన ఫార్మాట్‌లో రీ-రిలీజ్‌కు (Kodama Simham Re Release Update) సిద్ధమవుతోంది. మెగాస్టార్ అభిమానులను మరోసారి అలరించేందుకు, ఈ చిత్రం నవంబర్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రీ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
Also Read- Kishkindhapuri OTT: దీపావళికి బ్లాస్ట్.. ‘కిష్కింధపురి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?
మెగాస్టార్ మ్యాజిక్‌ను కొత్త తరానికి అందించడానికి..
చిరంజీవి నటించిన ఏకైక కౌబాయ్ సినిమా ఇదే కావడంతో, ఈ చిత్రానికి ప్రత్యేకమైన హిస్టరీ ఉంది. 1990, ఆగస్టు 9న విడుదలై ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. మెగాస్టార్ శ్వాగ్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఫైట్‌లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇప్పుడీ సినిమాను 4K కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్‌తో రీమాస్టర్ చేసి విడుదల చేయనున్నారు. ఈ రీ-రిలీజ్ కోసం చిత్ర నిర్మాతలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సాంకేతికంగా మెరుగులు దిద్దుతున్నారు. మెగాస్టార్ మ్యాజిక్‌ను కొత్త తరానికి అందించడానికి సరికొత్తగా ఈ ముస్తాబవుతుండటంతో మెగాభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు. విజయదశమి పర్వదినం సందర్భంగా రమా ఫిలింస్ అధినేత కైకాల నాగేశ్వర రావు ఈ రీ-రిలీజ్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా, అభిమానులు, ముఖ్యంగా 90స్ బ్యాచ్ ఈ సినిమా కోసం వేచి చూస్తున్నామంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఎందుకంటే ఆ బ్యాచ్‌కి ఈ సినిమా అప్పట్లో ఇచ్చిన కిక్ అలాంటిది మరి.
Also Read- Mega OG Pic: ‘మెగా ఓజీ పిక్’.. పవన్ సినిమాపై చిరు రివ్యూ అదిరింది
ప్రతీ పాట చార్ట్ బస్టరే..
కె. మురళీ మోహన రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధ, సోనం, వాణీ విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించారు. రాజ్ కోటి అందించిన మ్యూజిక్, ముఖ్యంగా బి.జి.యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇందులోని పాటల గురించి చెప్పేదేముంది. ‘స్టార్ స్టార్ మెగాస్టార్ స్టార్ స్టార్’ అనే సాంగ్ ఇప్పటికీ వినబడుతూనే ఉంటుంది. ఆ పాట ఒక్కటే కాదు.. ఇందులో ప్రతీ పాట చార్ట్ బస్టర్ సాంగేనంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. చిరంజీవి అత్యద్భుతన నటన, కైకాల సత్యన్నారాయణ సీనియారిటీతో పాటు, మోహన్ బాబు కామెడీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచి, సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. మెగాస్టార్ అభిమానులందరూ తమ అభిమాన హీరో కౌబాయ్ అవతారాన్ని మరోసారి పెద్ద తెరపై చూసి ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నవంబర్ 21న ‘కొదమసింహం’ సరికొత్తగా ముస్తాబై థియేటర్లలో సందడి చేయనుంది. మరి ఈ రీ రిలీజ్‌లో ఈ సినిమా ఇంకెన్ని సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు