Kishkindhapuri OTT
ఎంటర్‌టైన్మెంట్

Kishkindhapuri OTT: దీపావళికి బ్లాస్ట్.. ‘కిష్కింధపురి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?

Kishkindhapuri OTT: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ ‘కిష్కింధపురి’ (Kishkindhapuri) ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లలో ‘ఓజీ’ (OG Movie), ‘మిరాయ్’ (Mirai) మేనియా నడుస్తుండటంతో పాటు, కొత్తగా ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ (Idli Kottu), రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1) సినిమాలు విడుదల కాబోతుండటంతో.. ‘కిష్కింధపురి’ హవా పూర్తిగా తగ్గిపోయింది. ఈ సినిమాకు ప్రస్తుతం థియేటర్లు కూడా కరువయ్యాయి. దీంతో అందరూ ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు సిద్ధమయ్యారు. కానీ, ఒప్పందం ప్రకారం ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి ఇంకా చాలా టైమ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ డేట్ వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Mega OG Pic: ‘మెగా ఓజీ పిక్’.. పవన్ సినిమాపై చిరు రివ్యూ అదిరింది

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రెండు వారాల పాటు థియేటర్లలో రన్ అయిన ఈ సినిమాకు, ‘ఓజీ’ విడుదల తర్వాత థియేటర్స్ బాగా తగ్గిపోయాయి. అయినప్పటికీ ఈ సినిమా సక్సెస్‌ఫుల్ చిత్రంగానే ట్రేడ్ నిపుణులు తేల్చేశారు. మొత్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 25 కోట్లకు పైగానే వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి వినిపిస్తున్న సమాచారం ప్రకారం, అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్‌కు రానుందని అంటున్నారు. దీపావళికి ఓటీటీలో బ్లాస్టింగ్‌కు రెడీ అవుతుందని, మంచి టైమింగ్ ఈ సినిమా ఓటీటీకి కుదిరిందని అంతా అనుకుంటున్నారు. అయితే, ఈ సినిమా ఓటీటీ రైట్స్ దక్కించుకున్న వారు మాత్రం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ప్రస్తుతం థియేటర్స్ అంతగా ఈ సినిమాకు లేవు కాబట్టి.. స్ట్రీమింగ్ డేట్ ఇంకా ముందుకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో..

Also Read- Tilak Varma: హైదరాబాద్‌లో తిలక్ వర్మ సందడి.. పాక్‌పై ఆడిన వీరోచిత ఇన్నింగ్స్‌పై.. ఆసక్తికర వ్యాఖ్యలు

సెంటిమెంట్ వర్కవుటైంది

ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ముందే ‘కిష్కింధపురి’ ఓటీటీ హక్కులు సేల్ కావడం విశేషం. నాలుగు వారాల అనంతరమే ఓటీటీలోకి.. అనే నిబంధనతో ఈ సినిమా రైట్స్‌ని జీ5 సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ లెక్కన చూసుకుంటే అక్టోబర్ రెండో వారం ఎండింగ్‌లో లేదంటే, మూడో వారం స్టార్టింగ్‌లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. అలా లెక్కలు వేసే అక్టోబర్ 17న అంటూ కొందరు వార్తలు వైరల్ చేస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే.. కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఈ సినిమా కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసిందని అనుకోవచ్చు. అలాగే ‘రాక్షసుడు’ సెంటిమెంట్ కూడా వర్కవుట్ అయిందని అంతా అనుకుంటున్నారు. ఆ సినిమాలో కూడా శ్రీనివాస్‌, అనుపమ కలిసి నటించిన విషయం విదితమే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Mahakali: ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ ‘మహాకాళి’లో శుక్రాచార్యుడిగా ఎవరంటే?

Medak District: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్‌.. మెదక్‌లో రాజుకున్న రాజకీయ వేడి!

Rajasthan Bride: శోభనం రోజున వరుడికి బిగ్ షాక్.. వధువు దెబ్బకు ఫ్యూజులు ఔట్.. ఏమైందంటే?

H1B Visa Fee: హెచ్-1బీ ఫీజు పెంచిన ట్రంప్‌కి షాక్.. భారత్‌కు వచ్చే యోచనలో అమెరికా కంపెనీలు!

Kodama Simham: మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ కౌబాయ్ మూవీ ‘కొదమసింహం’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్!