Mega OG Pic: తన తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన ‘ఓజీ’ (OG Movie) సినిమాను మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన కుటుంబ సభ్యులందరితో (Mega Family) కలిసి వీక్షించారు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, సినిమా ఎలా ఉందో కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసలు ఊహించని ఈ ట్రీట్‌తో మెగా అభిమానులు యమా హ్యాపీగా ఫీలవుతున్నారు. అన్నయ్యా.. అంటూ అప్యాయంగా పిలుస్తూ.. వారు చెబుతున్న థ్యాంక్స్ కామెంట్స్‌తో చిరు ట్వీట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘ఓజీ’ చిత్రం.. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యద్భుత చిత్రంగా కొనియాడబడుతోంది. అభిమానులు ఈ సినిమా చూసి భావోద్వేగానికి గురవుతున్నారు. వింటేజ్ పవన్ కళ్యాణ్‌ను బయటకు తెచ్చిన సుజీత్‌కు, ట్రెమండస్ మ్యూజిక్ ఇచ్చిన థమన్‌కు వారు రుణపడి ఉన్నామంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read- Chiranjeevi: చరణ్ బాబుపై చిరంజీవి పోస్ట్ వైరల్.. ఏం అన్నారంటే?
హాలీవుడ్ రేంజ్‌లో
ఇక మెగాస్టార్ చిరంజీవి ‘ఓజీ’ రివ్యూ (Chiranjeevi OG Review) విషయానికి వస్తే.. ‘‘నా కుటుంబంతో కలిసి ‘ఓజీ’ సినిమాను చూశాను. ప్రతి క్షణాన్ని ఎంతగానో ఆస్వాదించాను. హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోని విధంగా, సరైన ఎమోషన్స్‌ని పట్టుకొని అద్భుతంగా తీసిన అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ చిత్రమిది. మొదటి నుంచి చివరి వరకు, దర్శకుడు ఈ చిత్రాన్ని అసాధారణంగా తీర్చిదిద్దారు. అందుకు దర్శకుడు సుజీత్‌కు శుభాకాంక్షలు. కళ్యాణ్ బాబును తెరపై చూసి చాలా గర్వపడ్డాను. తన శ్వాగ్‌తో సినిమాకు ప్రత్యేకత తీసుకొచ్చారు, అలాగే అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సరైన విందును అందించారు. సంగీత దర్శకుడు థమన్ తన హృదయాన్ని, ఆత్మను సంగీతంలో నింపారు. రవి.కె. చంద్రన్ అద్భుతమైన విజువల్స్ అందించారు, ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ కూడా అద్భుతంగా ఉన్నాయి. చిత్ర బృందంలోని ప్రతి ఒక్క సభ్యుడు తమ వంతు కృషి చేసి అత్యుత్తమమైన సినిమాను అందించారు. నిర్మాత దానయ్యకు, ఇంకా మొత్తం చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’’ అని చిరంజీవి తన పోస్ట్‌లు పేర్కొన్నారు.
Also Read- Varalaxmi Sarathkumar: తన సోదరి పూజా శరత్ కుమార్‌తో వరలక్ష్మి చేస్తున్న చిత్రానికి టైటిల్ ఫిక్స్!
‘మెగా ఓజీ పిక్’ వైరల్
ఇక ఆయన పోస్ట్ చేసిన పిక్స్‌ని అందరూ ‘మెగా ఓజీ పిక్’ అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. సోమవారం ప్రత్యేక ప్రదర్శన ద్వారా ఈ సినిమాను వీక్షించిన వారిలో.. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్, అకీరా నందన్, ఆధ్య ఉన్నారు. షో అనంతరం, వారందరూ చిత్రయూనిట్‌కు ఫొటోలు ఇచ్చారు. నిర్మాత దానయ్య, దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు థమన్, సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ వంటి వారంతా ఈ ఫొటోలలో ఉన్నారు. ఈ పిక్స్ చూసిన వారంతా, చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇలా సినిమా చూడటం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదని, అందరినీ ఒక చోటకు చేర్చిన ‘ఓజీ’కి, దర్శకుడు సుజీత్‌కు అభిమానులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Watched #TheyCallHimOG with my whole family and thoroughly enjoyed every bit of it. A brilliantly made underworld gangster film on par with Hollywood standards, while keeping the right emotions intact.
From beginning to end, the director conceived the film in an extraordinary… pic.twitter.com/jTWIlon5c8
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 30, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు